Viral Video: ఈ డ్రైవర్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందేనన్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో
Trending Video: ఈరోజు సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో ఒకటి వచ్చింది. ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒకటి కాదు రెండు మోటార్‌సైకిళ్లను నడుపుతున్నాడు. అది కూడా హైవేలో..
Viral Video: ఈ రోజుల్లో ఏదైనా డిఫరెంట్‌గా చేసి నెట్టింట్లో వైరల్ కావలనే తపన యువతలో ఉంది. అయితే ఇందుకోసం చేసే స్టంట్స్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. మీరు ఇప్పటి వరకు చాలా రకాల హెవీ డ్రైవర్లను చూసి ఉంటారు. కొంతమంది బైకర్లు బైక్‌లతో విన్యాసాలు చేస్తూ కనిపిస్తుంటారు. మరికొందరు బైకర్లు పూర్తిగా నేలపై పడిపోయేలా బైక్‌ను నడుపుతుంటుంటారు. ఇందుకోసం వారు తమ ప్రాణాలను కూడా ఫణ్ణంగా పెడుతుంటారు. అంతే కాదు చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ఒక వ్యక్తి ఒకేసారి ఒకటి కాదు రెండు మోటార్ సైకిళ్లను నడుపుతుంటాడు. అది కూడా మాములు రోడ్డులో కాదు.. కిక్కిరిసిన హైవేపై ఇలా రెండు బైక్‌లున డ్రైవ్ చేస్తుంటాడు.
వైరల్ అవుతున్న వీడియోలో, రెండు మోటార్‌సైకిళ్లను చాలా కూల్‌గా నడుపుతున్నట్లు మీరు చూడవచ్చు. ఈ వ్యక్తి రెండు మోటార్‌సైకిళ్లను నడుపుతున్న చోట, రహదారి ట్రక్కులు, బైక్‌లు, కార్లు వంటి వాహనాలతో బిజీగా ఉంది. అతను ట్రాఫిక్ నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఇలా రెండు బైక్‌లను నడిపాడు. పైగా తలకు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకరోజు క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోపై యూజర్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. హెవీ డ్రైవర్ అంటూ ఒకరు కామెంట్ చేయగా, ఇతనికి ఆస్కార్ ఇవ్వండి అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
Also Read: Viral Video: చిరుతపులిని ఎదురించిన కుక్క.. దాని అరుపులకు తోకముడిచిన చిరుత.. వీడియో వైరల్
Viral Video: అత్యుత్సాహం కొంప ముంచింది.. క్షణాల్లో తుక్కుతుక్కయిన బైక్, షాకింగ్ వీడియో..