CM Jagan: రైతుల అకౌంట్లలోకి నేరుగా ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు.. మరికాసేపట్లో విడుదల చేయనున్న సీఎం జగన్
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. మొత్తం రూ.564.28 కోట్లను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఒక్క బటన్ క్లిక్ తో రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాలను బదిలీ చేయనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద.. 1,220 రైతు గ్రూపులకు రూ.29.51 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. మొత్తం రూ.564.28 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్.. రైతుల ఖాతాలో నగదును జమ చేయనున్నారు. గతేడాది నవంబరులో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంచింది. ఈమేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రేపు రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ నిధులు జమ చేయనున్నారు.
మొత్తం రూ.534.77 కోట్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. దీని ద్వారా 5.71 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్రసేవా పథకం క్రింద రూ. 29.51 కోట్ల లబ్ధితో కలిపి మొత్తం రూ. 571.57 కోట్లు విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 1,612.62 కోట్లు అందించారు.
2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన మొత్తం 5,97,311 మంది రైతులకు రూ.571.57 కోట్లు ఇవ్వనున్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ అవుతుంది. అదే సీజన్‌లో పంటనష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని, ఆ తర్వాత సీజన్‌లో పెట్టుబడి పెట్టి కొంతమేర నష్టాన్ని పూడ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తీవ్ర వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తక నష్టపోయిన రైతులకు 80% రాయితీపై 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను భారీ వర్షాలు కురిసిన వెంటనే అందించారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 19.93 లక్షల మంది రైతులకు రూ.1612.62 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీగా అందించారు.
ఇవి కూడా చదవండి: Joint Pains – Yoga: కీళ్ల నొప్పులకు చక్కని ఉపశమనం.. ఇంట్లోనే ఇలా చేయండి చాలా.. మీ నొప్పులు మాయం..
Skin Care Tips: బాదం నూనె ఉపయోగిస్తే నిత్య యవ్వనం.. ముడుతలు లేని మెరిసే చర్మం మీసొంతం!