Mirchi Cost Today: ఘాటెక్కిన ఎర్ర బంగారం.. రికార్డ్ స్థాయికి చేరిన దేశీ రకం మిర్చి ధర..
Mirchi Cost Today: ఎర్ర బంగారం(Red Mirchi) ఘాటెక్కింది. ముఖ్యంగా దేశీ రకం మిర్చి రికార్డ్ స్థాయి ధర(Mirchi Rates) నమోదు చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో దేశీ రకం
Mirchi Cost Today: ఎర్ర బంగారం(Red Mirchi) ఘాటెక్కింది. ముఖ్యంగా దేశీ రకం మిర్చి రికార్డ్ స్థాయి ధర(Mirchi Rates) నమోదు చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో దేశీ రకం మిర్చి 27,000 పలికింది. రోజురోజుకు మార్కెట్లో(Mirchi Market) ఎర్ర బంగారం ధర పెరుగుతుండడంతో అన్నదాతలకు కొంత ఊరట లభిస్తుంది. వారం వ్యవధిలో క్వింటాల్‌కు రెండు వేల రూపాయలు పెరిగిందని మార్కెట్ అధికారులు అంటున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో ఎర్ర బంగారం విక్రయించేందుకు రైతులు వస్తూ ఉంటారు. గత సంవత్సరం మిర్చికి ఆశాజనకంగా ధరలు ఉన్నప్పటికీ.. మధ్యలో కొంత ధరలు తగ్గాయి. దీంతో అన్నదాతలు కొంత ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా మార్కెట్‌కు తేజ, 341, దేశీ, సింగల్ పట్టీ, టమాటో, వండర్ హాట్ రకాల మిర్చిని ఎక్కువగా రైతులు విక్రయించేందుకు తీసుకువస్తుంటారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తేజ రకానికి 18,000 వేల రూపాయలు పలికింది. 341 రకానికి రూ. 23,500 వేలు, వండర్ హాట్‌కు 20,000 రూపాయలు క్వింటాల్‌కు పలికింది. వారం వ్యవధిలోనే దేశీ రకం మిర్చి రూ. 27,000 పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం తెగుళ్లతో వంట బాగా దెబ్బతిందని, దిగుబడి కూడా ఆశించే విధంగా వచ్చే పరిస్థితి లేదని, అంతర్జాతీయంగా డిమాండ్ బాగా ఉండటంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రాహుల్ తెలిపారు.
Also read:
Kurnool Politics: రోడ్ల విస్తరణ వివాదం.. కర్నూలులో కాక రేపుతున్న సవాళ్ల రాజకీయం..
Karnataka Hijab Row: కొనసాగుతున్న హిజాబ్ వివాదం.. కర్నాటక హైకోర్టులో వాడివేడిగా వాదనలు..!
Minister Harish Rao: ఉద్వేగానికి గురైన మంత్రి హరీష్ రావు.. నాటి ఘటనలను తలుచుకుంటూ..