Medaram Jatara 2022: నేడు మేడారం మహాజాతరకు బయలుదేరనున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు..
Medaram Jatara 2022: మేడారం మహా జాతరకు వేళయ్యింది. ఈ జాతర ఘట్టంలో భగంగా నేడు అమ్మవారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం మహాజాతరకు బయలుదేరనున్నారు.
Medaram Jatara 2022: మేడారం మహా జాతరకు వేళయ్యింది. ఈ జాతర ఘట్టంలో భగంగా నేడు అమ్మవారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం మహాజాతరకు బయలుదేరనున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుండి మరికొద్ది సేపట్లో పగిడిద్దరాజు ప్రతిరూపంతో బయలుదేరనున్నారు ఆదివాసీ పూజారులు. సారలమ్మ, గోవిందరాజు గద్దెలపైకి వచ్చే సమయానికి పగిడిద్దరాజును మేడారానికి చేర్చుతారు. ఈ ముగ్గురు దేవుళ్ళను ఒకే సమయంలో అధికార లాంఛనాలతో గద్దెలపై ప్రాతిష్టిస్తారు. పూనుగొండ్ల ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం మేడారానికి కాలినడకన పయనమవుతారు. 66 కిలోమీటర్లు దట్టమైన అడవుల్లో కాలినడకన వాగులు, వంకలు దాటుకుంటూ జలపూజలు చేస్తూ పగిడిద్దరాజును మేడారానికి తీసుకెళ్ళనున్నారు పూజారులు. ఇవాళ బయలుదేరే పూజారులు.. ఈ రోజు రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేస్తారు. బుధవారం సారలమ్మ, గోవింద రాజు ప్రతిరూపాలను గద్దెల పైకి చెర్చే సమయానికి పగిడిద్ద రాజు మేడారానికి చేరుతారు.
వాహనాల రూట్ మ్యాప్.. ఇదిలాఉంటే.. నేటి నుంచి మేడారానికి వెళ్లే వాహనాలు వన్ వే ద్వారా దారి మళ్లించనున్నారు. భక్తులు, వాహనదారులు వన్ వే నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. తాడ్వాయి నుండి మేడారం వెళ్లే మార్గంలో కేవలం ఆర్టీసీ బస్సులు, VVIP వాహనాలకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని ప్రకటించారు. హైదరాబాద్, హనుమకొండ నుండి NH-163 మార్గంలో వచ్చే ప్రైవేటు వాహనాలు పస్రా మీదుగా మేడారానికి చేరుకునేలా వన్ వే ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే మహారాష్ట్ర, కాళేశ్వరం, కరీంనగర్ వైపు నుండి వచ్చే వాహనాలు కాల్వపల్లి మీదుగా మేడారం చేరుకునేలా ఏర్పాటు చేశారు.
Also read:
Mirchi Cost Today: ఘాటెక్కిన ఎర్ర బంగారం.. రికార్డ్ స్థాయికి చేరిన దేశీ రకం మిర్చి ధర..
Kurnool Politics: రోడ్ల విస్తరణ వివాదం.. కర్నూలులో కాక రేపుతున్న సవాళ్ల రాజకీయం..
Karnataka Hijab Row: కొనసాగుతున్న హిజాబ్ వివాదం.. కర్నాటక హైకోర్టులో వాడివేడిగా వాదనలు..!