AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes diet: తెలుసా! ఈ జ్యూస్‌ తాగారంటే 3 గంటల్లోనే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌ అవుతుంది..

మీరు కూడా డయాబెటిక్ పేషెంట్ ఐతే.. మీరు ఈ చక్కని చిట్కాతో డయాబెటిక్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. ప్రముఖ నూట్రీషియన్‌ మాటల్లో..

Diabetes diet: తెలుసా! ఈ జ్యూస్‌ తాగారంటే 3 గంటల్లోనే రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌ అవుతుంది..
Diabetes Diet
Srilakshmi C
|

Updated on: Feb 15, 2022 | 12:56 PM

Share

Diabetes Control Tips: ఈ రోజుల్లో మధుమేహం (Diabetes) సర్వసాధారణమై పోయింది. క్రమంతప్పిన ఆహార అలవాట్లు, ఉరుకులపరుగుల జీవనశైలి కారణంగా.. ఈ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. వయసుతో సంబంధంలేకుండా అందరినీ కబలిస్తోంది. అసలు ఏమిటీ డయాబెటిస్‌, ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనిని కంట్రోల్‌ చేయడం ఎలా? వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

డయాబెటిస్‌ అంటే.. మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే డయాబెటిస్‌ లేదా చక్కెర వ్యాధి లేదా మధుమేహం తలెత్తుతుంది.

చక్కెర వ్యాధిగా ఏవిధంగా మారుతుందంటే.. సాధారణంగా ఆహారం తీసుకుంటే శరీరానికి గ్లూకోజ్ అందుతుంది. ఈ గ్లూకోజ్‌ కణాలు శరీరానికి శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి. శరీరంలో ఇన్సులిన్ లోపిస్తే.. ఈ గ్లూకోజ్‌ తన పనిని సరిగ్గా చేయలేరు. ఫలితంగా కణాలకు గ్లూకోజ్ అందదు. ఈ గ్లూకోజ్ రక్తంలో నేరుగా చేరడం ప్రారంభమవుతుంది. దీనినే డయాబెటిస్‌ వ్యాధి అంటారు. డయాబెటిస్‌లో సంక్రమించిన వ్యక్తి శరీరానికి ఆహారం నుంచి శక్తిని తయారు చేయడం చాలా కష్టమవుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం మూలంగా శరీరానికి కావల్సిన పోషణ అందదు.

డయాబెటిస్‌ రకాలు..

  • టైప్ 1 డయాబెటిస్‌
  • టైప్ 2 డయాబెటిస్‌
  • గర్భధారణ డయాబెటిస్‌ (గర్భధారణ సమయంలో అధిక రక్త చక్కెర సమస్య)

టైప్ 2 డయాబెటిస్‌లో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని ఆహారాలలో GI స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. GI ఆహారాల్లోని కార్బోహైడ్రేట్ కంటెంట్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావాన్ని చూపుతుంది. మీరు కూడా డయాబెటిక్ పేషెంట్ ఐతే.. మీరు ఈ చక్కని చిట్కాతో డయాబెటిక్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. ప్రముఖ నూట్రీషియన్‌ రాబ్ హాబ్సన్ GI కలిగిన దానిమ్మ జ్యూస్‌ను సూచిస్తున్నారు .. దాని గురించి తెలుసుకుందాం..

దానిమ్మ రసం తాగితే  3 గంటల్లో..

దానిమ్మ రసం కేవలం 3 గంటల్లో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దానిమ్మ రసంలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని రాబ్ హాబ్సన్ అంటున్నారు. గ్రీన్ టీ కంటే కూడా మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయన్నారు. ఈ యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని చక్కెరను బంధించిఉంచి, ఇన్సులిన్ స్థాయిలపై ఎక్కువ ప్రభావం చూపకుండా కాపాడతాయని పరిశోధకులు తెలిపారు. డయాబెటిక్ పేషెంట్లలో దానిమ్మ రసం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా ఒక అధ్యయనం వెల్లడించింది. మీ కండరాలు, కాలేయంలోని కణాలు ఇన్సులిన్‌కు ప్రతిస్పందించనప్పుడు ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, రక్తం నుంచి గ్లూకోజ్‌ను సులభంగా తీసుకోలేవు. రక్తంలో గ్లూకోజ్ అధికమొత్తం చేరితే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. దీని కారణంగా శరీరంలోని కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి.

దానిమ్మ రసం ఎంత మోతాదులో తీసుకోవాలి.. రోజుకు ఒక గ్లాసు దానిమ్మ రసం తాగడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. ప్రస్తుతం మార్కెట్లో రకరాల దానిమ్మ జ్యూస్‌లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఈ జ్యూస్‌ను కొనేముందు కల్తీలేని దానిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. డయాబెటిస్ మెడిసిన్ మెట్‌ఫార్మిన్‌తో మీరు ఈ రసాన్ని తాగవచ్చా లేదా అనేవిషయాన్నిమాత్రం అధ్యయనాలు కనుగొనలేకపోయాయని కూడా ఆయన హెచ్చరించాడు. అందువల్ల ఈ జ్యూస్‌ త్రాగడానికి ముందు, ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం మర్చపోకండి.

ఎల్సెవియర్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దానిమ్మ రసం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. ఈ అధ్యయనంలో 12 గంటలపాటు ఏమీ తినని 85 మంది మధుమేహ పేషెంట్లకు చెందిన రక్త నమూనాలను సేకరించారు. ఆ తర్వాత1.5 ml దానిమ్మ రసం తాగిన మూడు గంటల తర్వాత రక్తనమూనాలను మళ్లీ సేకరించి పరీక్షించారు. మూడు గంటల తర్వాత తీసుకున్న శాంపిల్స్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారు.

గమనిక :- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్.. నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దయచేసి వీటిని అమలు చేసే ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read:

APVVP Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! బారీ స్థాయిలో ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు..