IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ నుంచి మరో టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు

IRCTC Tour Package: కోవిడ్‌ మహమ్మారి తర్వాత గత కొన్ని రోజుల నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్లు, విమానాలు ప్రారంభం అయ్యాయి...

IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ నుంచి మరో టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 15, 2022 | 1:24 PM

IRCTC Tour Package: కోవిడ్‌ మహమ్మారి తర్వాత గత కొన్ని రోజుల నుంచి ప్రయాణాలు జోరందుకున్నాయి. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రైళ్లు, విమానాలు ప్రారంభం అయ్యాయి. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) హ్యాపీ హిమాచల్‌ అండ్‌ పాపులర్‌ పంజాబ్‌ పేరుతో టూర్‌ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ టూర్ ప్యాకేజీ కింద హిమాచల్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో పర్యటనకు ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 8 రోజుల పాటు సాగే ఈ టూర్‌లో 7 రాత్రులు ఉంటాయి. అమృత్‌సర్‌, ఛత్తీస్‌గఢ్‌, ధర్మస్థల్‌, సిమ్లా ప్రదేశాలు ఉన్నాయి. ఈ టూర్‌ 10 ఏప్రిల్‌ 2022న ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి నుంచే బుకింగ్స్‌ను ప్రారంభించింది ఐఆర్‌సీటీసీ.

ఈ టూర్‌ ప్యాకేజీలో  భాగంగా పలు కేటగిరిల్లో టికెట్ల రేట్ల ఉన్నాయి. పెద్దలకు సింగిల్‌ బెడ్ అయితే 46,950 ఉండగా, డబుల్‌ బెడ్ అయితే రూ.34,100, ముగ్గురు అయితే రూ. 33100 ఉంది. ఇందులో పిల్లలకు అంటే 5-11సంవత్సరాలు ఉన్న వారికి బెడ్‌తో సహా 28,800 ఉండగా, బెడ్‌ లేకుండా రూ.26,450 ఉంది. ఇక 2 నుంచి4 సంతవ్సరాల్లోపు పిల్లలకు రూ.19,400 ఉంది. టికెట్లు బుక్‌ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో విమాన టికెట్స్‌, వసతి, భోజన,ఇతర ఖర్చులు ఉంటాయి. పూర్తి వివరాలకు  IRCTC వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్‌పై  క్లిక్ చేయండి.

Irctc