Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా?.. నిపుణులు ఏం చెబుతున్నారు..

వరంగల్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ హరిప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నాడు...

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా?.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 16, 2022 | 6:30 AM

వరంగల్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ హరిప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి పెద్ద బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Fixed Deposit)పై అధిక వడ్డీ ఇవ్వనున్నాయనే సమాచారమే అందుకు కారణం. అతను తన ఇంటి ఖర్చుల కోసం FD రిటర్న్‌లపై ఆధారపడతాడు. ఇప్పుడు తన పొదుపు ఖాతాలో ఉన్న డబ్బును కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాడు. మార్కెట్‌లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) వంటి ఇతర పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, పెట్టుబడి భద్రత, స్థిరమైన రాబడిని అందించడం వలన ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మొగ్గు చూపుతున్నారు. కార్వీ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2020 ప్రకారం దేశంలోని రూ. 262 లక్షల కోట్ల కుటుంబ పొదుపులలో రూ. 49 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్ల(Bonds)లో ఉన్నాయి. ఇవి మొత్తం పొదుపులో 19 శాతంగా ఉన్నాయి.

కానీ హరిప్రసాద్ లాగా, మీరు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను తెరవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు మరికొంత కాలం వేచి ఉండాలి. ప్రస్తుతం, FDలు, సేవింగ్ ఖాతాల రేట్లలో స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. నిజానికి, కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల కంటే పొదుపు ఖాతాలపై ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. వాస్తవానికి వడ్డీ రేట్ల తగ్గింపు ధోరణికి స్వస్తి పలికినట్లు కనిపిస్తోంది. US ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే దశలవారీగా వడ్డీ రేట్లను పెంచనున్నట్లు తెలిపింది. ఫెడ్ ఈ చర్య తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచాలని సూచించింది. ప్రస్తుతం ఎస్బీఐ పొదుపు ఖాతాపై 2.7 శాతం.. ఎఫ్డీలపై 2.90 నుచి 5.40 శాతం వరకూ సంవత్సరానికి వడ్డీ ఇస్తోంది.

మీరు 5.40 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలవ్యవధి కోసం రూ. 1 లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేస్తే, మీరు రూ. 1,30,760 వెనకేసుకుంటారు. వడ్డీ రేటును 6%కి పెంచితే 5 సంవత్సరాల తర్వాత మీరు మెచ్యూరిటీ సమయంలో రూ. 1,34,685 పొందుతారు. ఈ విధంగా మీ రాబడి రూ. 3,925 పెరుగుతుంది. ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ రాబడి వస్తుంది. వడ్డీ రేట్లు తగ్గే ధోరణి ఆగిపోయిందని ఆర్థిక విశ్లేషకులు రాహుల్ శర్మ అన్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని కేంద్ర బ్యాంకులకు ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తుందన్నారు. ద్రవ్యోల్బణం దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి వడ్డీ రేట్ల పెరుగుదల ధోరణి ప్రపంచంలో ఏర్పడుతోందని చెప్పారు.

ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ పబ్లిక్ కౌంటర్‌పార్ట్‌ల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. చిన్న బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. ఇది మీరు మీ FD ఖాతాను తెరవాలని భావించిన సమయంలో కాస్త గందరగోళ పరచవచ్చు. మీరు మీ పొదుపు ఖాతాను తెరిచిన బ్యాంకులోనే మీ fd ఖాతాను తెరవడం మంచిది. కొంచెం ఎక్కువ వడ్డీ రేట్ల కోసం కొత్త బ్యాంక్‌తో fd ఖాతాను తెరవడంలో ఎలాంటి ఉపయోగం లేదని గుర్తుంచుకోండి. ప్రైవేట్, చిన్న బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. కానీ బ్యాంకు సేవలను అందించడంలో అధిక రుసుములను కూడా వసూలు చేస్తాయి. మీరు FD ఖాతాను తెరవడానికి ఏదైనా ఇతర బ్యాంకులో కొత్త సేవింగ్స్ ఖాతాను తెరిస్తే, బ్యాంకు విధించే రుసుములను తెలుసుకోండి. అప్పుడు మీరు వడ్డీ రేట్లను కూడా సరిపోల్చుకోవాల్సి ఉంటుంది.

Read Also.. IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ నుంచి మరో టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు