Aadhaar PVC Card: మీ ఫ్యామిలీ ఆధార్ పీవీసీ కార్డులను డౌన్‌లోడ్ చేయాలా.. ఒకే మొబైల్ నంబర్‌తో ఎలా చేయాలంటే?
UIDAI Update: మీ ఆధార్‌తో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో సంబంధం లేకుండా, ప్రామాణీకరణ కోసం OTPని స్వీకరించడానికి మీరు ఏదైనా మొబైల్ నంబర్‌ని ఉపయోగించవచ్చు. దీంతో ఒక వ్యక్తి తన కుటుంబంలోని..
Aadhaar PVC Card: భారతదేశ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) ” ఆధార్ పీవీసీ కార్డ్ ” అనే కొత్త సేవను ప్రారంభించింది. ఇది ఆధార్ యూజర్లకు నామమాత్రపు రుసుముతో తమ ఆధార్ వివరాలను పీవీసీ (Aadhar PVC Card) కార్డ్‌పై ముద్రించుకోవడానికి అనుమతిస్తుంది. తాజాగా, ఒక వ్యక్తి ఒకే మొబైల్ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి అతని/ఆమె కుటుంబంలోని సభ్యులందరికీ PVC ఆధార్ కార్డ్‌లను ఆర్డర్ చేయవచ్చని ప్రకటించింది. ఆధార్ అనేది భారతీయతీయులందరికీ UIDAI జారీ చేసిన 12 అంకెల గుర్తింపు సంఖ్య. UIDAI వెబ్‌సైట్ ప్రకారం, Aadhaar PVC కార్డ్ అనేది UIDAI ద్వారా ప్రవేశపెట్టిన ఆధార్ తాజా రూపం. దీనిని తీసుకువెళ్లడం చాలా సులభం. చాలా మన్నికైనది. PVC-ఆధారిత ఆధార్ కార్డ్‌లో డిజిటల్ సంతకం చేసిన సురక్షిత QR కోడ్ ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ వివరాలతోపాటు రక్షణ పరంగా అనేక భద్రతా ఫీచర్లతో ముడిపడి ఉంది.
UIDAI ట్వీట్ ప్రకారం, మీరు మీ ఆధార్‌తో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో సంబంధం లేకుండా, ప్రామాణీకరణ కోసం OTPని స్వీకరించడానికి ఏదైనా మొబైల్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. కాబట్టి, ఒక వ్యక్తి మొత్తం కుటుంబం కోసం ఆధార్ PVC కార్డులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.
UIDAI ట్వీట్ ప్రకారం, వ్యక్తులు తమ ఆధార్‌తో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో సంబంధం లేకుండా ఏ మొబైల్ నంబర్ నుంచి అయినా కన్ఫర్మేషన్ కోసం OTPని అందుకోవచ్చు. ఒక ఆధార్ PVC కార్డ్‌కు జీఎస్‌టీ & స్పీడ్ పోస్ట్ ఛార్జీలతో సహా రూ. 50లు చేయాల్సి ఉంటుంద.
ఈ కార్డ్‌లో ఉన్న భద్రతా ఫీచర్లు..
సురక్షిత QR కోడ్
హోలోగ్రామ్
మైక్రో టెక్స్ట్
గోస్ట్ ఇమేజ్
జారీ తేదీ & ముద్రణ తేదీ
గిల్లోచే పాట్రాన్
ఎంబోస్డ్ ఆధార్ లోగో
నమోదు కాని లేదా ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఆధార్ PVC కార్డ్‌ని ఎలా ఆర్డర్ చేయాలంటే?
1: https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.inని సందర్శించాలి.
2: ‘మై ఆధార్ కార్డ్’ సర్వీస్‌లోని “ఆర్డర్ ఆధార్ కార్డ్” ఆఫ్షన్‌పై క్లిక్ చేయాలి.
3: మీ 12 అంకెల ఆధార్ నంబర్ (UID) లేదా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VID) లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ID ని నమోదు చేయండి.
4: క్యాప్చ్ కోడ్‌ను నమోదు చేయండి
5: మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోతే “నా మొబైల్ నంబర్ రిజిస్టర్ కాలేదు” అనే ఆఫ్షన్‌పై క్లిక్ చేయాలి.
6: నమోదు కాని లేదా ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
7: “సెండ్ ఓటీపీ”పై క్లిక్ చేయండి
8: “నిబంధనలు, షరతులు” అనే చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి
9: “సబ్మిట్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి
10: “మేక్ పేమేంట్”పై క్లిక్ చేయండి.
ఆ తరువాత పేమెంట్ గేట్‌వే పేజీకి వెళ్తుంది. పేమెంట్ చేశాక, డిజిటల్ సంతకంతో కూడిన రసీదు వస్తుంది. అనంతరం పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం మీరు రిక్వెస్ట్ చేసిన సర్వీస్ నంబర్ తాలుకా వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో మీ మొబైల్ నంబర్‌కు వస్తాయి.
UIDAI వెబ్‌సైట్ ప్రకారం, ఆర్డర్ చేసిన 5 పని దినాలలో UIDAI ముద్రించిన ఆధార్ కార్డ్‌లను తపాలా శాఖకు అందజేస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ డెలివరీ నిబంధనలకు అనుగుణంగా ఆధార్ PVC కార్డ్‌లు ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ ద్వారా ఆధార్ డేటాబేస్‌లోని చిరునామాకు డెలివరీ చేస్తారు.
UIDAI వెబ్‌సైట్ ప్రకారం, కింది పద్ధతుల్లో ఏదైనా ఒకదాన్ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు:
· క్రెడిట్ కార్డ్
· డెబిట్ కార్డ్
· నెట్ బ్యాంకింగ్
· UPI
· PayTM
#OrderAadhaarPVC You can use any mobile number to receive #OTP for #authentication, regardless of the registered mobile number with your #Aadhaar. So, one person can order Aadhaar PVC cards online for the whole family. Follow the link https://t.co/G06YuJBrp1 to order now. pic.twitter.com/uwELWteYOT
— Aadhaar (@UIDAI) January 27, 2022
Deep Sidhu: ఎర్రకోట హింస కేసులో నిందితుడు, పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి..