Deep Sidhu: ఎర్రకోట హింస కేసులో నిందితుడు, పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి..

గతేడాది జనవరిలో జరిగిన గణతంత్ర దినోత్సవ హింసాకాండ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన నటుడు దీప్ సిద్ధూ(deep sidhu) రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Deep Sidhu: ఎర్రకోట హింస కేసులో నిందితుడు, పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మృతి..
Deep Siddhu
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 15, 2022 | 10:34 PM

గతేడాది జనవరిలో జరిగిన గణతంత్ర దినోత్సవ హింసాకాండ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన నటుడు దీప్ సిద్ధూ(deep sidhu) రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ (kmp) ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. సిద్ధూ ఢిల్లీ నుంచి పంజాబ్‌లోని భటిండాకు వెళుతుండగా, ఈరోజు రాత్రి 9:30 గంటలకు ఆయన ప్రయాణిస్తున్న కారు(car) ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టిందని(accident) పోలీసులు తెలిపారు.

గత ఏడాది ఫిబ్రవరి 9న కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ ట్రాక్టర్ ర్యాలీలో ఆందోళనకారులను రెచ్చగొట్టారనే ఆరోపణలపై సిద్ధూను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు విచారించి 70 రోజుల పాటు కస్టడీలో ఉన్న తర్వాత నటుడు-కార్యకర్తకు ఏప్రిల్ 17న బెయిల్ మంజూరైంది. అయితే, ఎర్రకోట హింసకు సంబంధించి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా అదే రోజు అతన్ని అరెస్టు చేశారు. తొమ్మిది రోజుల తర్వాత రెండో కేసులో సిద్ధూకు బెయిల్‌ లభించింది.

రైతు నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టడంతో పాటు పలు చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగడంతో ర్యాలీ హింసాత్మకంగా మారింది. వందలాది మంది రైతులు ఎర్రకోటపై దాడి చేసి, ఆస్తులను ధ్వంసం చేసి, అక్కడి పోలీసులతో ఘర్షణ పడ్డారు. నిరసనకారులు ఎర్రకోటను ఛేదించి దానిపై తమ మత జెండాను ఎగురవేశారు.

Read Also.. Crime News: కిలాడీ ప్రేమ జంట.. స్కెచ్ వేసి హోటల్‌కి వెళ్లారు.. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్..