Petrol Diesel Price: పెట్రోలు, డీజిల్ ధరలపై యుద్ధమేఘాల ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా..
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 95 దగ్గర ట్రేడవుతోంది.
Petrol-Diesel Rates Today: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 95 దగ్గర ట్రేడవుతోంది. అయితే, దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటమే ఉపశమనం. ఐఓసీఎల్ బుధవారం దేశంలో ఇంధన చమురు ధరను ప్రకటించింది. నేటికీ ఇంధన చమురు ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు 105 రోజులుగా స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నవంబర్ 4, 2021న పెట్రోల్ , డీజిల్ ధరలలో చివరి మార్పు జరిగిందని పేర్కొనవచ్చు. అప్పటి నుంచి దేశంలోని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.అయితే.. చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వ్యత్యాసాలున్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.07గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.49గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.29గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.69గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.57లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.59గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.12గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.22గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.12లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.14 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.68గా ఉంది.
ఇవి కూడా చదవండి: Ukraine Russia Crisis: ర్యష్యా వెనక్కి తగ్గలేదు.. పుతిన్ యుద్ధతంత్రంపై అమెరికా కీలక ప్రకటన..
Rudraksha Tree: మన తెలుగు నేలపై కాస్తున్న రుద్రాక్షలు.. ఎక్కడో తెలుసా?