AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: విదేశాలకు వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్‌ పోతే ఏం చెయ్యాలో తెలుసా? ఇలా చేశారంటే వెంటనే..

మీరెప్పుడైనా విదేశాలకు వెళ్లినప్పుడు.. అక్కడ ఒకవేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది, దానిని తిరిగి పొందాలంటే ఏం చెయ్యాలి, స్వదేశానికి తిరిగి ఎలా చేరుకోవాలి వంటి.. సమాచారం మీ కోసం..

Knowledge: విదేశాలకు వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్‌ పోతే ఏం చెయ్యాలో తెలుసా? ఇలా చేశారంటే వెంటనే..
Passport Rules
Srilakshmi C
|

Updated on: Feb 16, 2022 | 12:30 PM

Share

Lost Your Passport? you need to know these rules: చదువు కోసమో, ఉద్యోగ రిత్యా, కుటుంబ సభ్యులను కలవడానికి లేదా పర్యటన.. కారణమేదైనా స్వదేశం విడిచి విదేశాలకు వెళ్లే సందర్భం వస్తుంది. ఐతే ఈ ప్రపంచంలో ఏ దేశానికి ప్రయాణం చేయాలన్నా.. ఆయా దేశాలకు వెళ్లడానికి అనుమతిని కోరుతూ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. పాప్‌పోర్ట్‌ లభించిన తర్వాత సదరు దేశంలోకి అనుమతి ఉంటుంది. ఐతే అక్కడి వెళ్లడానికి మాత్రమే కాదు తిరిగి స్వదేశం రావడానికి కూడా అదే పాస్‌పోర్టు ఖచ్చితంగా ఉండాలి. కొన్ని సార్లు దురదృష్టం కొద్దీ పాస్‌పోర్ట్‌ పోగొట్టుకుని, అది తిరిగి ఎలా పొందాలో తెలియక ఏళ్ల తరబడి అక్కడే మగ్గిపోతున్న కథనాలు కూడా లేకపోలేదు. మీరెప్పుడైనా విదేశాలకు వెళ్లినప్పుడు.. అక్కడ ఒకవేళ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది, దానిని తిరిగి పొందాలంటే ఏం చెయ్యాలి, స్వదేశానికి తిరిగి ఎలా చేరుకోవాలి వంటి.. సమాచారం మీ కోసం..

పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఏం చెయ్యాలి? విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ ఒక ముఖ్యమైన ధృవీకరణ పత్రం. ప్రయాణానికి మాత్రమే కాకుండా.. అక్కడ మీరు మీ పాస్‌పోర్ట్‌తోనే గుర్తించబడతారు. మరి ఇంతటి ప్రాముఖ్యం కలిగిన, గుర్తింపుకు చిరునామైన పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా! ముందుగా కంగారుపడకుండా.. మన దేశంలో మదిరిగానే ఆ దేశంలోని ఏదైన పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేయాలి. మీరు ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత, ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని అంటే ఇండియన్ ఎంబసీ ఎక్కడుందో కనుగొని వారి సహాయాన్ని కోరాలి.

ఎంబసీ ఈ విధంగా సహాయపడుతుంది? ఎంబసీని సంప్రదించిన తర్వాత, మీరిచ్చిన ఫిర్యాదు తాలూకు సమాచారాన్ని వారికి అందించి, మీ పూర్తి వివరాలను తెలియజేయాలి. అంతేకాకుండా మీరు ఇక్కడ రెండవ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కూడా. మీరు విదేశాల నుండి తిరిగి రావడానికి, ఎంబసీ మీ రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్‌ను సిద్ధం చేస్తుంది. ఐతే ఈ కొత్త పాస్‌పోర్ట్‌ ప్రక్రియ స్వదేశంలో (భారతదేశం) తయారు చేయబడిన తర్వాత మాత్రమే ఆ దేశానికి వెళుతుంది. ఈ ప్రక్రియకు కొన్ని రోజుల సమయం పడుతుంది. అంతవరకు ఆ దేశంలోనే ఉండవల్సి ఉంటుంది.

ఐతే మీరు విదేశాలకు వెళ్లిన కొద్ది రోజుల్లోనే పాస్‌పోర్ట్ పోయినట్లయితే, తిరిగి రావడానికి దాదాపు 1 నెల రోజుల సమయం ఉంటే.. ఈ నెల రోజుల కాలంలో ఎంబసీ రెండవ పాస్‌పోర్ట్ రెడీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. అలాకాకుండా మీకు అక్కడ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండవల్సి ఉంటే, అప్పుడు ఎంబసీ నుంచి అత్యవసర సర్టిఫికేట్ జారీ చేస్తుంది. దాని ద్వారా మీరు సులువుగా ఆ దేశం నుండి తిరిగి స్వదేశానికి రావచ్చు. ఐతే స్వదేశానికి వచ్చాక తప్పనిసరిగా కొత్త పాస్‌పోర్ట్ తీసుకోవల్సి ఉంటుంది.

Also Read:

JEE Advanced 2022: ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 నిర్వహించనున్న ఐఐటీ ముంబాయి.. ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభం!