JEE Advanced 2022: ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 నిర్వహించనున్న ఐఐటీ ముంబాయి.. ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభం!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bombay) ముంబాయి ఈ ఏడాది జరగబోయే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Advanced 2022) అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది..

JEE Advanced 2022: ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022 నిర్వహించనున్న ఐఐటీ ముంబాయి.. ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభం!
Iit Bombay
Follow us

|

Updated on: Feb 16, 2022 | 11:35 AM

IIT Bombay will be organising the IIT entrance exam this year: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bombay) ముంబాయి ఈ ఏడాది జరగబోయే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Advanced 2022) అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఐఐటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 కోసం ప్రత్యకంగా వెబ్‌సైట్ jeeadv.ac.inను కూడా ఐఐటీ ముంబాయి ప్రారంభించింది. కాగా ఈ ఏడాది జరగనున్న జేఈఈ మెయిన్ 2022, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షలకు సంబంధించిన డేట్‌ షీట్‌లు త్వరలో విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in లేదా nta.ac.inలలో అందుబాటులో ఉంటాయి. అలాగే ఐఐటీ ముంబాయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022కు సంబంధించిన సమాచారాన్ని jeeadv.ac.inలో ఉంచుతుంది. ఇక జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరవడానికి అర్హులుగా పరిగణించబడతారు. ఎన్టీఏ గతేడాది (2021) నుంచి ఏడాదికి నాలుగుసార్లు జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మెయిన్స్ ఫలితాలు వెలువడిన తర్వాత జూఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించబడుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత సాధిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2020 లేదా 2021లో 12వ తరగతి (లేదా తత్సమానం) పరీక్షలో మొదటిసారి హాజరైన అభ్యర్థులు జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2021కు నమోదు చేసుకున్నప్పటికీ కొందరు కోవిడ్ మహమ్మారి కారణంగా రెండింటికీ హాజరు కాలేకపోయారు. ఇటువంటి వారిని కూడా జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2022 (పేపర్ 1, 2)కి నేరుగా హాజరు కావొచ్చనే కీలక ప్రకటన కూడా విడుదల చేసింది. ఐతే ఇటువంటి అభ్యర్ధులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2022 కోసం ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాలి. ఈ అభ్యర్థులు జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2022కు హాజరు కావడానికి జేఈఈ (మెయిన్) 2022లో అర్హత సాధించిన వారితోపాటు, అదనంగా పరిగణించబడతారని నోటిఫికేషన్ పేర్కొంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ప్రతి సంవత్సరం ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీలు (IIT ఖరగ్‌పూర్, IIT కాన్పూర్, IIT మద్రాస్, IIT ఢిల్లీ, IIT ముంబాయి, IIT గౌహతి, IIT రూర్కీ) నిర్వహిస్తాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను గతేడాది IIT ఖరగ్‌పూర్ నిర్వహించగా.. ఏడాది IIT ముంబాయి నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

Also Read:

IIT Delhi Recruitment 2022: బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏ అర్హతతో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.50 వేల వరకు జీతం..

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి