IIT Delhi Recruitment 2022: బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏ అర్హతతో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.50 వేల వరకు జీతం..

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ (IIT Delhi) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

IIT Delhi Recruitment 2022: బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏ అర్హతతో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.50 వేల వరకు జీతం..
Iit Delhi
Follow us

|

Updated on: Feb 16, 2022 | 10:52 AM

IIT Delhi Project Staff Recruitment 2022: న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ (IIT Delhi) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Staff posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  • ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌: 1
  • ప్రాజెక్ట్‌ అటెండెంట్‌: 1
  • జూనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 1
  • సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 1
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 4

పే స్కేల్‌: నెలకు రూ.19,000ల నుంచి రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్మీడియట్‌, డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: 5g.bhartischool@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IBPS PO Admit Card 2021: ఐబీపీఎస్‌ పీఓ 2021 ఇంటర్వ్యూ రౌండ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

Latest Articles