IBPS PO Admit Card 2021: ఐబీపీఎస్‌ పీఓ 2021 ఇంటర్వ్యూ రౌండ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS PO) ప్రొబేషనరీ ఆఫీసర్ 2021 పోస్టులకు ఇంటర్వ్యూ రౌండ్ కోసం అడ్మిట్ కార్డు (Interview Round Admit Card)లను విడుదల చేసింది. అధికారిక..

IBPS PO Admit Card 2021: ఐబీపీఎస్‌ పీఓ 2021 ఇంటర్వ్యూ రౌండ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
Ibps Po 2021
Follow us

|

Updated on: Feb 16, 2022 | 10:28 AM

IBPS PO 2021 interview round admit cards: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS PO) ప్రొబేషనరీ ఆఫీసర్ 2021 పోస్టులకు ఇంటర్వ్యూ రౌండ్ కోసం అడ్మిట్ కార్డు (Interview Round Admit Card)లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌ ibps.in.లో కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులకు చెందిన ఐబీపీఎస్‌ పీఓ రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీని నమోదు చేయాలి. ఇంటర్వ్యూ రౌండ్ అడ్మిట్ కార్డ్‌లు ఫిబ్రవరి 14 నుండి మార్చి 3 వరకు అందుబాటులో ఉంటాయి. ముగింపు తేదీ కంటే ముందే అభ్యర్థులు తమ కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్ధులకు సూచించింది. కాగా ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్ 2021-22 పరీక్ష ఈ ఏడాది జనవరి 22 న నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 11న ప్రకటించింది. ఇక ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రోసెస్‌లో తుది ఘట్టమైన ఇంటర్వ్యూకు కాల్‌ లెటర్లను కూడా విడుదల చేసింది. ఇంటర్వ్యూ మార్కులు, మెయిన్స్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.

ఐబీపీఎస్‌ పీఓ ఇంటర్వ్యూ రౌండ్ అడ్మిట్ కార్డును 2021 ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • ముందుగా ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్ ibps.in.ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో ‘Click here to download interview call letter CRP PO/MT-XI’ లింక్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీని నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • స్క్రీన్‌పై ఐబీపీఎస్‌ పీఓ ఇంటర్వ్యూ రౌండ్ అడ్మిట్ కార్డ్‌ కనిపిస్తుంది.
  • డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Also Read:

GATE 2022 Results: గేట్‌ 2022 రెస్పాన్స్‌ షీట్లు విడుదల..! ఇలా చెక్‌ చేసుకోండి..

Latest Articles