GATE 2022 Results: గేట్ 2022 రెస్పాన్స్ షీట్లు విడుదల..! ఇలా చెక్ చేసుకోండి..
ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఫిబ్రవరి 15న (మంగళవారం) తన అధికారిక వెబ్‌సైట్‌లో గేట్ రెస్పాన్స్ షీట్స్ 2022లను విడుదల చేసింది. అభ్యర్థులకు..
GATE Response Sheets 2022: ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఫిబ్రవరి 15న (మంగళవారం) తన అధికారిక వెబ్‌సైట్‌లో గేట్ రెస్పాన్స్ షీట్స్ 2022లను విడుదల చేసింది. అభ్యర్థులకు సంబంధించిన లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్gate.iitkgp.ac.inలో ప్రతిస్పందన షీట్ (రెస్పాన్స్ షీట్స్)లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2022)ను ఫిబ్రవరి 5, 6,12, 13 తేదీల్లో ఉదయం – మధ్యాహ్నం రెండు సెషన్‌లలో ఆన్‌లైన్ విధానంలో జరిగాయి. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలను ఫిబ్రవరి 21 (సోమవారం)న విడుదల చేయనుంది. తుది ఫలితాలు మార్చి 17 (గురువారం)న ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను మార్చి 21 (సోమవారం) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ 2022 పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.gate.iitkgp.ac.inను సందర్శించాలని ఈ సందర్భంగా సూచించింది.
గేట్ 2022 రెస్పాన్స్ షీట్‌లను ఎలా చెక్ చేసుకోవాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజీలో ‘లాగిన్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
- ఎన్‌రోల్‌మెంట్ నెంబర్/ఇమెయిల్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
- వెంటనే అభ్యర్థులకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
Also Read: