AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stamina: శరీరంలో స్టామినా లేక ఇబ్బంది పడుతున్నారా..? ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉండాలంటే ఇలా చేయండి..

Increasing Stamina Naturally: ఉరుకులు పరుగుల జీవితంలో మనమందరం ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండటానికి ఇష్టపడుతుంటాం.. ప్రస్తుత కాలంలో చాలామంది రెండు అంతస్తుల బిల్డింగ్ ఎక్కేందుకే అలసిపోతున్నారు.

Stamina: శరీరంలో స్టామినా లేక ఇబ్బంది పడుతున్నారా..? ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉండాలంటే ఇలా చేయండి..
Stamina
Shaik Madar Saheb
|

Updated on: Feb 16, 2022 | 12:18 PM

Share

Increasing Stamina Naturally: ఉరుకులు పరుగుల జీవితంలో మనమందరం ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండటానికి ఇష్టపడుతుంటాం.. ప్రస్తుత కాలంలో చాలామంది రెండు అంతస్తుల బిల్డింగ్ ఎక్కేందుకే అలసిపోతున్నారు. అయితే.. చాలామంది ఆరోగ్యవంతంగా.. చలాకీగా, ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించినా శరీరం సహకరించదు. ‘స్టామినా’ (Stamina) అనే పదాన్ని ప్రస్తావించినప్పుడల్లా మనకు గుర్తుకు వచ్చేది శారీరక బలం. దీంతోపాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టిపెట్టాలి. అయితే, శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. మీరు సహజమైన పద్దతుల (Increasing Stamina Naturally) ద్వారా శారీరక శక్తిని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నారా? దీనికోసం స్టెరాయిడ్లు, సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇది మంచిది కాదు. ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. ఉత్తమ మార్గం ఏమిటంటే ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు సహజంగా మీ శారీరక శక్తిని పెంచుతాయి. అవేంటో (Health Tips) ఇప్పుడు తెలుసుకుందాం..

అల్పాహారం మానేయకండి

మీరు మీ రోజును ఆరోగ్యకరమైన డైట్‌తో ప్రారంభించండి. అల్పాహారం రోజులో అత్యంత ఆవశ్యకమైన భోజనం. మీ శరీరం జీవక్రియను మెరుగుపరచడానికి, అల్పహారం తప్పనిసరిగా తీసుకోండి. వీలైతే, ఓట్ మీల్స్ లేదా హోల్ వీట్ బ్రెడ్, గుడ్లను, వేరుశనగ ఫుడ్స్‌ను మీ బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోండి.

హైడ్రేటెడ్ గా ఉండండి

శరీరంలో శక్తి తక్కువగా ఉన్నట్లయితే.. డీహైడ్రేటెడ్‌గా ఉన్నారని అర్ధం చేసుకోవాలి. కావున మీరు ద్రవపదార్థాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా నీరు తాగడం చాలా ముఖ్యం. అల్పాహారంగా ప్రతిరోజూ ఒక గ్లాసు బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది. బీట్‌రూట్‌లో పెద్ద మొత్తంలో నైట్రేట్‌లు ఉన్నాయి. ఇవి శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మెగ్నీషియం కోసం

మీరు క్రీడలలో లేదా ఏదైనా శారీరక శ్రమలో నిమగ్నమై ఉంటే.. మీరు మెగ్నీషియంను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యం. మెగ్నీషియం గ్లూకోజ్‌ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. ఆకు కూరలు, తృణ ధాన్యాలు, చేపలు, సోయాబీన్స్, అవకాడో, అరటిపండ్లు, డార్క్ చాక్లెట్‌లల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

పిండి పదార్థాలు

బంగాళాదుంపలు, బ్రౌన్ బ్రెడ్ లాంటి కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలు మీ శరీరానికి పిండి పదార్ధాలను అందిస్తాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సాధారణ పిండి పదార్థాలు కాకుండా.. బ్రెడ్, పాస్తా, అన్నం వంటి ఆహారాలలో ఉండే కాంప్లెక్స్ పిండి పదార్థాలు రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి.

వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అలసటను అధిగమించవచ్చు. దీంతో మీ శరీరం చురుకుగా మారడంతోపాటు.. మీరు ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. దీనికోసం.. ప్రతిరోజూ కొన్ని నిమిషాలు జాగింగ్, వాకింగ్ లేదా స్విమ్మింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. అదేవిధంగా ఆటలు ఆడటం, సైక్లింగ్ లాంటివి చేయడం వల్ల కూడా శక్తి పెరుగుతుంది.

మంచి నిద్ర

మీ శరీరానికి రోజు చివరిలో రివైండ్ చేయడానికి సమయం కావాలి. కావున మీ మానసిక, శారీరక పనితీరును మెరుగుపరచడానికి మీరు ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్ర పొవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు రాత్రిపూట నిద్రపోవడంలో ఇబ్బంది ఉంటే, ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. ఇది ఒత్తిడిచ, మానసిక అలసటను అధిగమించడానికి సహాయపడుతుంది. అయితే, అధిక భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల మీ శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి మీరు మీ డిన్నర్, నిద్ర మధ్య కనీసం ఒక గంట గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.

ఆహారం..

స్టామినా పెంచడానికి.. మీరు ఏమి తింటున్నారో వాటి గురించి అవగాహనతో ఉండాలి. మీరు తినే ఆహారం మీకు ఏదైనా మేలు చేస్తుందా లేదా అనే దానిపై మీరు దృష్టి పెట్టడం చాలా అవసరం. దీనివల్ల రోటిన్ ఫుడ్ తీసుకోవచ్చు. దీంతో మీ శరీరానికి తగినంత శక్తి అందుతుంది.

ఉప్పు

మీరు చెమట పట్టినప్పుడు లేదా కఠినమైన శారీరక శ్రమలో నిమగ్నమైనప్పుడు చెమట పట్టిన సమయంలో మీ శరీరం చాలా ఉప్పును కోల్పోతుంది. మీ సోడియం స్థాయిలు అకస్మాత్తుగా పడిపోకుండా ఉండాలంటే.. మీరు ఉప్పు తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. తక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల మైకంతోపాటు సత్తువ తగ్గుతుంది.

Also Read:

Women Health: ఆ వయసు తర్వాత.. ప్రతి మహిళ ఈ ఐదు వైద్య పరీక్షలు చేయించుకోవాలి..

Ghee Benefits: రోజు నెయ్యి తినేవారికి అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటంటే..!