AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kacha Badam: పచ్చి బాదం ఎక్కువగా తింటున్నారా? మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే..

Almonds Side Effects:'కచా బాదం' పాట సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ఊపేస్తుందో మనందరికీ తెలిసిందే.

Kacha Badam: పచ్చి బాదం ఎక్కువగా తింటున్నారా? మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే..
Shiva Prajapati
|

Updated on: Feb 16, 2022 | 1:32 PM

Share

Raw Almonds Side Effects:‘కచా బాదం’ పాట సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ఊపేస్తుందో మనందరికీ తెలిసిందే. ఒరిజినల్ పాటను రకరకాలుగా రీక్రియేట్ చేసి మరీ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. వీడియో యాప్స్‌లో రకరకాల రీల్స్ కూడా చేస్తుననారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ ఈ కచా బాదం పాటను అద్భుతమైన రీతిలో పాడారు. పాటను ఎంజాయ్ చేస్తున్నట్లుగానే.. బాదం పప్పును తినడాన్ని కూడా ప్రజలు ఆస్వాధిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే కారణంతో రోజుకు కనీసం 2 బాదం పప్పులైనా తింటారు ప్రజలు. అయితే, బాదం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో పచ్చి బాదం తింటే అంతకు మించిన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పచ్చి బాదం ఎక్కువగా తినడం వల్ల కలిగే 4 నష్టాలు.. ప్రతి ఒక్కరూ బాదం పప్పును రకరకాలుగా తీసుకుంటారు. చాలా మంది పచ్చిగా తింటారు, కొందరు నానబెట్టి తినడానికి ఇష్టపడతారు. బాదంపప్పులో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్, డైటరీ ఫైబర్ ఉంటాయి. పచ్చి బాదంపప్పును సమతుల్య పరిమాణంలో తింటే ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ దానిని అధికంగా తీసుకోవడం 4 విధాలుగా హానికరం. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. పోషకాల శోషణలో ఇబ్బందులు.. పచ్చి బాదం పప్పులను ఎక్కువగా తినడం వల్ల మన శరీరం కొన్ని రకాల పోషకాలు గ్రహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆకుపచ్చ బాదంలో టానిన్ ఉంటుంది. ఇది మన జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

2. కాలేయానికి నష్టం.. పచ్చి బాదం పప్పులను ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాలేయంపైనా ప్రభావం పడుతుంది. ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

3. మైగ్రేన్ ఉన్నవారు తినొద్దు.. మైగ్రేన్‌తో బాధపడేవారు పచ్చి బాదం ఎక్కువగా తినకూడదు. ఒకవేళ ఎక్కువగా తింటే ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులో అనేక సమ్మేళనాలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో అనేక రసాయన ప్రతిచర్యలు జరుగుతాయి. అందుకే పచ్చి బాదం పప్పును తినొద్దని వైద్యులు కూడా సూచిస్తారు.

4. కిడ్నీ సమస్యలు.. బాదం పప్పు అతిగా తింటే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇందులో ఆక్సలేట్ ఉన్నందున కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బాదం పప్నును తినకూడదని వైద్యులు సూచిస్తారు.

Also read:

Bjp vs Trs: మోడిని తరిమేస్తారా.. బికేర్ ఫుల్.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత సీరియస్ వార్నింగ్!

Andhra Pradesh: కర్నూలు వరుస ఘటన కలకలం.. ఓ చోట భారీ చోరీ.. మరో చోట మాత్రం..

Traffic Signals: ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తే చాలు టెంప్ట్ అయిపోతారు.. అర్థరాత్రి వచ్చి పని పూర్తిచేసి వెళ్తారు..