AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bjp vs Trs: మోడీని తరిమేస్తారా.. బికేర్ ఫుల్.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత సీరియస్ వార్నింగ్!

Bjp vs Trs: బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టార్గెట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన..

Bjp vs Trs: మోడీని తరిమేస్తారా.. బికేర్ ఫుల్.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత సీరియస్ వార్నింగ్!
Shiva Prajapati
|

Updated on: Feb 16, 2022 | 1:27 PM

Share

Bjp vs Trs: బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టార్గెట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘మోదీని తరిమేస్తారా?.. బికేర్‌ ఫుల్.. కేసీఆర్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో’’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మీ మోసాలను, కుటుంబ పాలనను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు చేసే అర్హత కేసీఆర్‌కు ఉందా? అని నిప్పులు చెరిగారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయన్నారు. కేసీఆర్.. దేశాభివృద్ధిని చూడలేకపోతున్నారని విమర్శించారు. అప్పులు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఆస్తులు అమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే నువ్వా మాట్లాడేది అంటూ వీర్రాజు ఊగిపోయారు. సోనియాకు సాష్టాంగ నమస్కారం చేసిన చరిత్రను మరిచిపోయావా? అని అన్నారు.

Somu Veerraju

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విపక్ష నేత చంద్రబాబుపైనా సోము వీర్రాజు విమర్శలు దాడి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ వైసీపీ రాజకీయం చేస్తోందని అన్నారు. గతంలో చంద్రబాబు ప్యాకేజీ కింద వేల కోట్లు తెచ్చుకున్నారని ఆరోపించారాయన. అదే పంధాలో జగన్ పయనించి.. నిధులు తెచ్చారని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద తెచ్చిన కోట్ల రూపాయలు ఏమయ్యాయని సోము వీర్రాజు ప్రశ్నించారు. వీటన్నింటిపై చంద్రబాబు, జగన్‌లతో ఒకే వేదికపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం అని ప్రకటించారు సోము వీర్రాజు. ఐదేళ్లలో రాజధాని కట్టకుండా చంద్రబాబు విఫలమయ్యారని, ఇప్పుడు సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘మీ తప్పులు బయట పడకుండా.. అవసరమైనప్పుడల్లా ప్రత్యేక హోదా అంశాన్ని తెర పైకి తెస్తారా? అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ టిడిపి, వైసీపీ నాయకులు’’ అని ధ్వజమెత్తారు. మీ మోసాలను, కుటుంబ పాలనను ప్రజలకు వివరిస్తామంటూ వైసీపీ, టీడీపీలకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

Also read:

Andhra Pradesh: కర్నూలు వరుస ఘటన కలకలం.. ఓ చోట భారీ చోరీ.. మరో చోట మాత్రం..

Traffic Signals: ట్రాఫిక్ సిగ్నల్ కనిపిస్తే చాలు టెంప్ట్ అయిపోతారు.. అర్థరాత్రి వచ్చి పని పూర్తిచేసి వెళ్తారు..

Hyderabad: వెబ్‌సిరీస్ చూసి ఆరితేరాడు.. మనుషులనూ పెట్టుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్స్..!