Low Platelet Count: ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి..? పెంచుకోవడం ఎలా..?

Low Platelet Count: డెంగీ జ్వరం వచ్చిందంటే చాలు అధికంగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతుంటాయి. దీని వల్ల పేషెంట్‌ ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంటుంది. ఒక దశలో ప్రాణాలు పోయే..

Low Platelet Count: ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి..? పెంచుకోవడం ఎలా..?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 16, 2022 | 10:12 AM

Low Platelet Count: డెంగీ జ్వరం వచ్చిందంటే చాలు అధికంగా ప్లేట్‌లెట్స్‌ పడిపోతుంటాయి. దీని వల్ల పేషెంట్‌ ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంటుంది. ఒక దశలో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి జ్వరం వచ్చినప్పుడు వైద్యులు ఇచ్చే మందులతో పాటు కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహార ప‌దార్థాలు తీసుకోవడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. దీని వల్ల డెంగీ జ్వరం నుంచి బయటపడవచ్చు.

ప్లేట్‌లెట్స్‌ ఎందుకు తగ్గుతాయి?

శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. ప్రస్తుత జనరేషన్‌లో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు రక్తం పలుచబడటానికి ఉపయోగించే మందుల వల్ల ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ప్లేట్‌లెట్స్ మరీ తక్కువగా ఉన్నపుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. ప్లేట్ లెట్స్ సక్రమంగా తమ విధిని నిర్వహించలేకపోతే రక్తస్రావం ఆగదు. దానికి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం గానీ ప్లేట్‌లెట్ల నాణ్యత తగ్గిపోవడంగానీ కారణం కావచ్చు అంటున్నారు.

ప్లేట్‌లెట్స్‌ ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఏమిటి..?

తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తూ శరీరం బారిన పడకుండా కాపాడుతుంటాయి. ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శరీరం మొత్తానికి అవసరమైన ఆక్సీజన్ అందిస్తుంది. ఇక మిగిలినవి ప్లేట్ లెట్స్ శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతాయి. ఇవి అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉంటాయి. ప్లేట్‌లెట్స్ కణం 7-10 రోజుల వరకు బతికి ఉంటుంది. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ మళ్లీ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించి ప్రాణరక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్‌లెట్స్.

ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి..

ఆప్రికాట్‌ పండ్లను రోజు రెండు సార్లు తీసుకుంటే చాలు. రక్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. ఎండు ఖర్జూరం, కివీ పండ్లను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెరుగుతాయి. ఇక ముఖ్యంగా బొప్పాయి పండ్లు డెంగీ వ్యాధికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దీని ద్వారా డెంగీ జ్వరం నుంచి బయటపడడమే కాకుండా వేగంగా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దానిమ్మ పండ్లను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతాయి. ఇవి రక్తం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

విటమిన్‌ కె పదార్థాలు..

విటమిన్‌ కె ఉన్న ఆహారాలను తీసుకోవడం ఎంతో మంచిది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్య పెంచుతుంది. వెల్లుల్లి రేకులను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య సమృద్దిగా పెరుగుతుంది. బీట్‌ రూట్‌ జ్యూస్‌ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌ రక్తహీనతతో బాధపడేవారే కాకుండా డెంగీ వచ్చిన వారు కూడా తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

క్యారెట్‌తో రక్తం వృద్ధి:

క్యారెట్‌ను తరచూ తింటున్నా రక్తం వృద్ది చెంది తద్వారా ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. ఇలా డెంగీ జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్‌ పడిపోయినా, రక్తహీనతతో బాధపడుతున్న వారు ఈ పండ్లను తీసుకున్నట్లయితే వైద్యుడి వద్దకు వెళ్లకుండా ఇంట్లో ఉండే నయం చేసుకోవచ్చు.

(గమనిక: ఈ అంశాలన్ని వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర