వర్షాకాలం ప్రారంభం అయ్యింది. తొలకరి చినుకుల నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వర్షాకాలం
అయితే ఈ సమయంలో కొన్ని అత్యవసర పని వలన చాలా మంది వర్షంలో తడవాల్సి వస్తుంది.
వర్షంలో తడవడం
ఇలాంటి సమయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. లేకపోతే ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతన్నారు నిపుణులు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వర్షంలో తడిచిన వెంటనే తడి బట్టలు తీసి వేసి పొడి బట్టలు ధరించాలంట. లేకపోతే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తాయి.
సీజనల్ వ్యాధులు
అలాగే వర్షం నీటిలో కొన్ని సార్లు చెడు బ్యాక్టీరియా, దుమ్మ ఉంటుంది. అందువలన వర్షంలో తడిచిన తర్వాత తప్పకుండా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలంట.
వేడి నీటి స్నానం
అదే విధంగా, కొంత మంది తడి జుట్టుతో నిద్రించడం లాంటిది చేస్తారు. కానీ అస్సలే మంచిది కాదంట, ఇది జుట్టు సమస్యలను పెంచడమే కాకుండా, తలనొప్పికి కారణం అవుతుంది.
తడి జుట్టు
వర్షంలో తడిచిన తర్వాత తప్పకుండా గోరు వెచ్చటి నీరు తాగడం లేదా అల్లం టీ, హెర్బల్ టీ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అల్లం టీ
వర్షం నీటిలో నడవడం వలన పాదాలు, గోళ్లలో బ్యాక్టీరియా చేరుతుంది కాబట్టి, గోరు వెచ్చటి నీటితో కాళ్లు, గోర్లు, చేతులను శుభ్రపరుచుకోవాలి.