బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా? వీరికి ఇది విషమే

Samatha

10 June 2026

బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఉదయం పరగడుపు ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగుతారు.

బీట్ రూట్ జ్యూస్

ఇందులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన శరీరానికి  అనేక విధాలుగా మేలు చేస్తుంది.

పోషకాలు పుష్కలం

అయితే బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ కొంత మంది దీనిని అస్సలే తాగకూడదంట. వారు ఎవరంటే?

కొందరు తాగకూడదు

కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడేవారు దీనిని అస్సలే అతిక మోతాదులో తీసుకోకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

కిడ్నీలో రాళ్లు

బీట్ రూట్‌లో ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇవి కిడ్నీలో రాళ్లు పెరిగేలా చేస్తాయంట. అందువలన కిడ్నీ, మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు తక్కువగా తీసుకోవడం మంచిది.

రాళ్ల సమస్య తీవ్రతరం

అంతే కాకుండా లో బీపీ ఉన్నవారు కూడా దీనికి చాలా దూరం ఉండాలంట. లేకపోతే ఇది బీపీని ఇంకా తగ్గిస్తుంది. దీని వలన నీరసం ఎక్కువ అవుతుంది.

లో బీపీ ఉన్న వారు

అలర్జీ సమస్యలు, ముఖ్యంగా గొంతు వాపు, దద్దుర్లు ,దురద వంటి సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు బీట్ రూట్ జ్యూస్ తాగకూడదంట.

అలర్జీ ఉన్నవారు

అలాగే ఐరన్ ఎక్కువగా ఉన్నవారు కూడా బీట్ రూట్ జ్యూస్  తాగక పోవడమే మంచిది. ముఖ్యంగా హిమూ క్రోమాటోసిస్ ఉన్న వారు తీసుకోవడం వలన లివర్ సమస్యలు వస్తాయంట.

ఐరన్ ఎక్కువ ఉన్నవారు