Viral Video: తన బిడ్డను రక్షించుకునేందుకు పాముపై దాడి చేసిన కుందేలు.. వీడియో వైరల్
Viral Video: ఒక తల్లి తన పిల్లల కోసం తన జీవితాన్ని పణంగా పెడుతుంది. పిల్లల కోసం పెద్దగా రిస్క్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడదు. బిడ్డకు ఏదైనా ప్రమాదం పొంచివుందంటే....
Viral Video: ఒక తల్లి తన పిల్లల కోసం తన జీవితాన్ని పణంగా పెడుతుంది. పిల్లల కోసం ఎంత పెద్ద రిస్క్ చేయడానికైనా వెనుకాడదు. బిడ్డకు ఏదైనా ప్రమాదం పొంచివుందంటే.. ప్రాణాలు పోయినసరే పోరాడుతుంటుంది. ఇలాంటి మనస్తత్వం మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ ఉంటుంది. అలాంటి వీడియోను మీకు చూపించబోయేది. పిల్లల జీవితాల విషయానికి వస్తే మనుషులైనా, జంతువులైనా, వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఏదైనా చేయగలరు. ప్రమాదకరమైన పాము పిల్లపై దాడి చేయడానికి కుందేలు వద్దకు రాగా, తల్లి కుందేలు (Rabbit) పాము (Snake)పై దాడి చేసింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుందేలు తల్లి విషపూరితమైన పాముపై పోరాడింది. పాము, కుందేలు మధ్య భీకరపోరు కొనసాగింది. కుందేలు, పాము పోట్లాడుకునే ఈ భయానక వీడియో చాలా పాతది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుందేలు పాముతో పరిగెత్తింది. రెండింటి మధ్య తీవ్ర పోరు జరిగింది. కుందేలు పామును వెంటాడుతుంటే పాము పరుగులు పెట్టింది. ఒక వైపు పాము కుందేలుపై దాడి చేస్తుంటే ఏ మాత్రం తగ్గకుండా పాముపై తిరగబడింది కుందేలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి: