Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!

ప్రముఖ సింగర్.. మ్యూజిక్ కంపోజర్ బప్పి లాహిరి కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితం కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరి చికిత్స

Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!
Bappi Lahiri
Follow us

|

Updated on: Feb 16, 2022 | 9:26 AM

ప్రముఖ భారతీయ గాయకుడు మరియు స్వరకర్త బప్పి లాహిరి కన్నుమూశారు. ఈరోజు ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బప్పి లహిరిగాా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లాహిరి వయసు కేవలం 69 ఏళ్లు. అతను భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. బప్పి లహిరి 1970-80 చివరలో చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి అనేక చిత్రాలలో సూపర్ పాటలను అందించారు. 2020లో శ్రద్దా కపూర్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బాఘీ 3లో భంకాస్ పాట చివరిగా ఆలపించారు. తెలుగులో బప్పి లహిరి సింహాసనం సినిమాకు సంగీతం అందించాడు.. ఆ తర్వాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‏స్పెక్టర్ చిత్రాలకు సంగీతం అందించారు.

1952 నవంబర్ 27న కోల్‌కతాలో జన్మించిన బప్పి లాహిరి తన విభిన్న శైలి కారణంగా చిత్ర పరిశ్రమలో విభిన్నమైన గుర్తింపును తెచ్చుకున్నారు. నిత్యం బంగారు ఆభరణాలతో ఉండే సంగీత విద్వాంసుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో హిట్ పాటలు పాడారు. బప్పి లహిరి మొదటి సూపర్ హిట్ చిత్రం అమీర్ ఖాన్ తండ్రి తాహిర్ హుస్సేన్ నటించిన జఖ్మీ సినిమా. గతేడాది కరోనా సోకడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి చికిత్స తీసుకున్నారు బప్పి లహిరి.

Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..

Sandhya Mukherjee: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి..

Anushka Shetty: హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..

Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!

Latest Articles