Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులను బట్టి మనుషుల గుణగణాలను అంచనా వేస్తుంటారు. రాశుల వారిగా కొందరు మానసికంగా బలంగా ఉంటారు.

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..
Zodiac Sings
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 16, 2022 | 8:40 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులను బట్టి మనుషుల గుణగణాలను అంచనా వేస్తుంటారు. రాశుల వారిగా కొందరు మానసికంగా బలంగా ఉంటారు. అలాగే మరికొందరు చాలా సున్నితంగా.. మృదుశాలిగా ఉంటారు. అంతేకాకుండా.. ప్రతి రోజు రాశి ఫలాలు తెలుసుకోవడం వలన తమ జీవితంలో ఎదురయ్యే కఠినపరిస్థితులను ఎదుర్కోనేందుకు మానసికంగా సిద్ధమవుతారు. ఇక రాశిచక్రం ప్రకారం కొందరు ఎమోషనల్ అవుతుంటారు. అయితే రాశిచక్రం ప్రకారం ఈ నాలుుగు రాశుల వారు.. తమ ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరట. ఎన్నేళ్లు అయినా తమ శత్రుత్వాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. తమ శత్రువులపై పగ తీర్చుకోకుండా అస్సలు ఉండరు. చిన్న విషయమైన.. పెద్ద సమస్య అయినా ప్రతీకారం తీర్చుకునేవరకు విడిచిపెట్టరట. మరీ ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకుందామా..

మేషరాశి.. మేషరాశి.. అన్నింటికంటే పెద్ద పగ తీర్చుకునేదట. ఈ రాశివారు అబ్బాయిలు.. అమ్మాయిలు ఏ విషయంలోనైనా సులభంగా అస్సలు క్షమించరు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. తప్పు చేసినవారికి వారి ప్రవర్తనను ఎలాగైనా చూపించాలనుకుంటారు. తమ పగ తీర్చుకోవడానికి వీరు మరింత దారుణంగా.. దుర్మార్గంగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదు.

మకర రాశి.. ఈరాశి వారు శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేవరకు అస్సలు విడిచిపెట్టరు. వారి శత్రువుల జీవితాన్ని మరింత దారుణంగా మార్చేంతవరకు ఊరుకోరు. ప్రతిక్షణం పగ తీర్చుకోవడం కోసం ఆలోచిస్తుంటారు. ఒకవేళ శత్రువులను వదిలేయ్యాలని వారికి వారే ఆలోచన వచ్చేవరకు తమ పగను విడిచిపెట్టరు. అలాగే.. వారిని జీవితాంతం శత్రువుగా చూస్తూనే ఉంటారు.

కర్కాటక రాశి.. ఈ రాశివారు తమ ప్రతీకారం తీర్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. శత్రువులపై పగ తీర్చుకునే విషయంలో వీరు అచితూచి వ్యవహరిస్తారు. అలాగే ఏ అవకాశాన్ని వదులుకోకుండా తమ పగను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువగా మాటలను.. లేదా వస్తువులను పగ తీర్చుకోవడం కోసం ఉపయోగిస్తుంటారు.

వృశ్చిక రాశి.. సాధారణంగా ఈరాశి వారు తమ శత్రువులను ఎప్పటికీ క్షమించరు. చాలా సంవత్సరాలు గడిచిన వారు తమ పగను మాత్రం మర్చిపోరు. అంతేకాకుండా.. వీరు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే అస్సలు వెనకడుగు వెయ్యరు. వీరు క్షమించడం చాలా అరుదు. ప్రతీకారం తీర్చుకోవడానికి చెడు దారుల వైపు అస్సలు ఆసక్తి చూపించరు. సరైన దారిలోనే పగ తీర్చుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు.

గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ప్రచురించిన ఆధారంగా.. జ్యోతిష్య నిపుణుల నివేదిక ప్రకారం మాత్రమే ఇవ్వబడింది.

Also Read: Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ… బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..

Naveen Chandra: ప్రేమికుల రోజున సతీమణిని పరిచయం చేసిన నవీన్‌ చంద్ర.. క్యూట్‌ కపుల్‌ అంటోన్న నెటిజన్లు..

Vishnu Manchu: నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది.. కానీ కొంతమంది దాన్ని ఆయనకు అందజేయలేదు: మంచు విష్ణు

Sarkaru Vaari Paata: సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాటగా రికార్డు క్రియేట్ చేసిన క‌ళావ‌తి పాట‌..