AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Manchu: నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది.. కానీ కొంతమంది దాన్ని ఆయనకు అందజేయలేదు: మంచు విష్ణు

   ఏపీ సీఎం వైస్ జగన్‌ను.. సినీ ప్రముఖులు కలవడం ఇంకా ఆగడంలేదు. ఆ మధ్య సీఎంను కలిసి సినీ సమస్యల గురించి మాట్లాడిన చిరంజీవి..

Vishnu Manchu: నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది.. కానీ కొంతమంది దాన్ని ఆయనకు అందజేయలేదు: మంచు విష్ణు
Vishnu
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2022 | 7:45 PM

Share

Vishnu Manchu.ఏపీ సీఎం వైస్ జగన్‌ను.. సినీ ప్రముఖులు కలవడం ఇంకా ఆగడంలేదు. ఆమధ్య సీఎంను కలిసి సినీ సమస్యల గురించి మాట్లాడిన చిరంజీవి.. ఆ కొద్ది రోజులకే మహేష్, ప్రభాస్, రాజమౌళి.. మరి కొంత మంది ఇండస్ట్రీ వాళ్లతో కలిసి సీఎంను కలిశారు. ఇక ఇప్పుడు తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిండెట్ మంచు విష్ణు కూడా సీఎం జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన విష్ణు.. ఆయనతో సినీ సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఆ తరువాత బయటికి వచ్చిన విష్ణు ఈ భేటీపై స్పందించారు. సీఎంతో భేటీ వ్యక్తిగత సమావేశం మాత్రమేనన్నారు మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశారు ఈ మంచువారబ్బాయి.

అయితే ఈ భేటీ వ్యక్తిగత సమావేశం అని విష్ణు చెబుతున్నా… లోపల మతులబేతో బలంగా ఉంటుందనే చెబుతున్నారు సినీ విశ్లేషకులు. విష్ణు మాట్లాడుతూ.. సీఎం జగన్ ను కలవడం ఇది మూడో సారి. నాకు వరుసకు బావ అవుతారు.అయినా అన్న అని పిలుస్తాను అని అన్నారు. ఇక ఇవాళ కలిసింది పూర్తిగా పర్సొనల్ విజిట్ అని విష్ణు పేర్కొన్నారు. అలాగే నేను తిరుపతిలో స్టూడియో లు కడతాను. రెండు తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి. తెలంగాణ, ఆంధ్రా రెండు కళ్లు. విశాఖలో అవకాశాల కోసం ఫిల్మ్ ఛాంబర్లో చర్చిస్తాం.. మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగింది. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. అయినా ఆయనకు అందజేయలేదు. పేర్ని నాని తో సమావేశం పై ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేసింది  అన్నారు. నాకు అన్ని పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారు . టీడీపీలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారు . పేర్ని నాని మా ఇంటికి వస్తే ఏదో కారణాలు చెప్తూ ప్రచారం చేశారు. మాకు సపోర్ట్ లేకపోతే మా ప్రెసిడెంట్ గా ఎలా గెలుస్తాను.. అందరినీ చిత్తు చిత్తుగా ఓడించాను అంటూ చెప్పుకొచ్చారు విష్ణు. అయితే మా ప్రెసిండెట్‌గా ఉన్నా కూడ విష్ణును ఎవరూ పట్టించుకోకపోవడం… చిరు అంతకంతకూ ఇండస్ట్రీలో పెద్దగా… ‘మా’ కు ప్రత్యామ్నాయంగా తయారు అవుతుండడంతో… ఆయనకు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే విష్ణు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని కొందరు సినీవిశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే!

మరిన్ని ఇక్కడ చదవండి : 

DJ Tillu Movie : సడన్‌గా థియేటర్‌లో ప్రత్యక్షమైన డీజే టిల్లు టీమ్.. కేరింత‌లు కొట్టిన ఆడియన్స్

Balakrishna: బాలయ్యకు కూతురుగా క్రేజీ హీరోయిన్.. అనిల్ రావిపూడి సినిమాలో ఆ భామ..

Actor Ali: సీఎం జగన్‌తో సమావేశమైన నటుడు అలీ దంపతులు .. రాజ్యసభ సీటుపై మళ్లీ ఊపందుకున్న ఊహాగానాలు..