AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Nagalla: జోరు పెంచిన తెలుగమ్మాయి.. అక్కడ కూడా అనన్యకు ఆఫర్లు..

Ananya Nagalla: 'మల్లేశం' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార అనన్య నాగళ్ల. తొలి సినిమాలోనే అద్భుత నటనతో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది....

Ananya Nagalla: జోరు పెంచిన తెలుగమ్మాయి.. అక్కడ కూడా అనన్యకు ఆఫర్లు..
Ananya Nagalla
Narender Vaitla
|

Updated on: Feb 15, 2022 | 6:56 PM

Share

Ananya Nagalla: ‘మల్లేశం’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార అనన్య నాగళ్ల. తొలి సినిమాలోనే అద్భుత నటనతో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో పద్మ అనే పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ తెలుగమ్మాయి. అనంతరం 2021లో వచ్చిన ప్లేబ్యాక్‌ చిత్రంలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో కూడా అనన్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ సినిమా తర్వాత ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ.

వకీల్‌ సాబ్‌లో నటించిన అనన్య తన యాక్టింగ్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అనంతరం నితిన్‌ హీరోగా తెరకెక్కిన మాస్ట్రోలో నటించింది. ఇలా టాలీవుడ్‌లో డీసెంట్ మూవీస్‌లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్న అనన్యకు తాజాగా కోలీవుడ్‌లో అవకాశం దక్కింది. తమిళంలో శశికుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. తాజాగా ఈ విషయాన్ని అనన్య స్వయంగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది.

పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘తొలి తమిళ సినిమా’ అనే క్యాప్షన్‌ను జోడించింది. తంగం పా శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే అనన్య గతంలో నటించిన ‘ప్లేబ్యాక్‌’ కూడా టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో వచ్చిన సినిమానే కావడం విశేషం. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Also Read: Pushpa: సామీ సామీ పాటకు గర్భిణీ సూపర్‌ డ్యాన్స్‌.. నెటిజన్ల మది దోచుకుంటోన్న వైరల్‌ వీడియో..

UP Elections 2022: రైతులకు బీజేపీ భారీ వరాలు.. ఐదేళ్ల పాటు కరెంట్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..

Jagadish Reddy: మీటర్లు పెట్టనందుకే వేధిస్తున్నారు.. బీజేపీ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్..