- Telugu News Photo Gallery Cinema photos Famous Heroes Who Lost Fame In Tollywood in previous years here is the list
Viral Photos: ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్స్.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా.? విశేషాలు మీకోసమే!
Tollywood: బ్రతికి చెడడం అంటే ఇదేనేమో...! ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో లవర్ బాయ్స్ పేరు తెచ్చుకొని వరస సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న టాలెంటెడ్ హీరోస్ ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోయిన హీరోలు గురించి..
Updated on: Feb 15, 2022 | 6:56 PM

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో లవర్ బాయ్స్ పేరు తెచ్చుకొని వరస సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న టాలెంటెడ్ హీరోస్

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలు సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ స్టార్స్‌గా నిలబడింది ఇద్దరే. ఒకరు బాలయ్య.. మరొకరు జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు.అయితే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరో తారక రత్న సక్సెస్ కాలేకపోయాడు.రక్ చేసిన సినిమాలలో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అందుకే హీరోగా సినిమాలు చేయడమే మానేసాడు తారక రత్న. అయితే ఈ హీరో మాత్రం ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి రికార్డు సృష్టించారు

అలనాటి నటి.. డబ్బింగ్ ఆర్టిస్టు రోజా రమణి, చక్రపాణి దంపతుల తనయుడు తరుణ్ కుమార్.బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరుణ్ హీరోగా మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు.ఇండస్ట్రీలో అసలైన లవర్ బాయ్ గా గుర్తింపు పొంది అమ్మాయిల పాలిట కలల రాకుమారుడిగా వెలుగొందాడు.వరుస హిట్స్ అందుకున్నతరుణ్ ని ఆతర్వాత వరుస పరాజయాలు వెంటాడడంతో గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వేణు తొట్టెంపూడి... అయితే చాలా కాలంగా వేణు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

సెంటిమెంట్ హీరో గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వడ్డే నవీన్. అయితే చాలా కాలంగా నవీన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

హీరో ఆకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ఆనందం’ వంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్.. తరువాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేశారు. కానీ హీరోగా అతనికి మంచి విజయాలు దక్కలేదు. దీంతో తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్లారు.

దాసరి నారాయణ రావు పేరు తెలియాని వాళ్లు ఉండరు అనే చెప్పాలి. అయితే నారాయణ రావు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దాసరి అరుణ్ కుమార్ కూడా కొన్ని సినిమాల తరువాత సినీ ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు

‘ఓ చిన్నదాన’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ‘ఆనంద్’ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాజా మెప్పించారు. అయితే, ఎన్నో కలలతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన రాజా ఇక్కడ ఇమడలేకపోయారు.కొన్నాళ్ళు బ్రదర్ గా చేసారు రాజా

కామెడీ కింగ్ బ్రహ్మానందం పెద్ద కుమారుడు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిఫరెంట్ సినిమాలు చేసి నటుడిగా మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు గాని కమర్షియల్ గా హిట్స్ అందుకోలేదు.

సాయిరాం శంకర్ హీరోగానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో సాయిరాం శంకర్ గతంలో రూపొందిన ‘బంపర్ ఆఫర్’ చిత్రం, సాధించిన విజయం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఈ మధ్య కాలం లో అవకాశాలు తగ్గిపోయిన ఇండస్ట్రీలోనే సినిమాలను ట్రై చేస్తూ ఇప్పుడు బంపర్ ఆఫర్ 2 కి సిద్ధం అవుతున్నాడు ఈ హీరో.





























