UP Elections 2022: రైతులకు బీజేపీ భారీ వరాలు.. ఐదేళ్ల పాటు కరెంట్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ బీజేపీ ఆ రాష్ట్ర రైతన్నలకు భారీ తాయిలాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి...
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ బీజేపీ ఆ రాష్ట్ర రైతన్నలకు భారీ తాయిలాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రైతులు ఐదేళ్ల పాటు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తాజాగా దిబియాపూర్‌లోని ఓ పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా.. యూపీ ప్రజలు, రైతులపై వరాల జల్లు కురిపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే.. రైతులకు వచ్చే ఐదేళ్లు కరెంట్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అని చెప్పిన ఆయన.. నెక్స్ట్ ఐదేళ్లలలో రైతన్నలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే మార్చి 10వ తేదీన యూపీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని.. ఆ రోజున బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే.. మార్చి 18న హోలీ పండుగ కానుక ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇళ్లకు చేరుతాయన్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి, రెండో దశ పోలింగ్ తర్వాత రాష్ట్రం నుంచి సమజ్‌వాదీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని సంచలన కామెంట్స్ చేశారు. “పోలింగ్ రెండు దశలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ 300 కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పునాది వేసింది” అని ఆయన అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ రెండోదశ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగియగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Uttar Pradesh | Holi is on 18th (March), counting is on 10th, bring BJP govt to power on 10th, free gas cylinders will reach your house on 18th. No farmer will have to pay electricity bills for the next 5 years: Union Home Minister Amit Shah, in Dibiyapur, Auraiya pic.twitter.com/QFhFU7rjun
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 15, 2022