Anushka Shetty: హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు హీరోయిన్‏గా పరిచయమైంది అనుష్క శెట్టి (Ansushka Shetty).

Anushka Shetty: హీరోయిన్లకు తెలుగులో అవకాశాలు రావాలంటే అలా చేయాల్సిందే.. అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..
Anushka
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 16, 2022 | 7:05 AM

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు హీరోయిన్‏గా పరిచయమైంది అనుష్క శెట్టి (Ansushka Shetty). మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత అనుష్క తెలుగులో వరుస ఆఫర్లతో అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. కేవలం గ్లామరస్ పాత్రలే కాకుండా.. క్యారెక్టర్ కోసం తన శరీరాకృతిని మార్చుకోని బొద్దుగా మారిపోయింది. అరుంధతి, బాహుబలి, సైజ్ జీరో, భాగమతి వంటి చిత్రాల్లో తన నటన పరంగా అనుష్క సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

జక్కన్న తెరకెక్కించిన బాహుబలి తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి మూవీ అప్డేట్ రాలేదు. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాలో అనుష్క కీలకపాత్రలో కనిపించనుంది. అయితే గత కొద్దిరోజులుగా సైలెంట్‏గా ఉన్న అనుష్క.. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి టాలీవుడ్ చిత్రపరిశ్రమలోనూ ఉంది. నేను అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. నేను సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా.. నిక్కచ్చిగా మాట్లాడతాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను.. నా మనస్తత్వం తెలిసి నా దగ్గర ఎప్పుడు ఎవరు అలా మాట్లాడలేదు అంటూ చెప్పుకొచ్చింది స్వీటీ.

Also Read: Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ… బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..

Naveen Chandra: ప్రేమికుల రోజున సతీమణిని పరిచయం చేసిన నవీన్‌ చంద్ర.. క్యూట్‌ కపుల్‌ అంటోన్న నెటిజన్లు..

Vishnu Manchu: నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది.. కానీ కొంతమంది దాన్ని ఆయనకు అందజేయలేదు: మంచు విష్ణు

Sarkaru Vaari Paata: సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాటగా రికార్డు క్రియేట్ చేసిన క‌ళావ‌తి పాట‌..