Sharwanand: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రెస్మీట్లో శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..
యంగ్ హీరో శర్వానంద్ (Sharawand) ఎప్పుడు వైవిధ్యభరితమైన చిత్రాలను ఎంచుకుంటూ సక్కెస్ అవుతున్నాడు. కంటెంట్ ప్రాధాన్యత సినిమాల్లో నటిస్తూ సినీ పరిశ్రమలో
యంగ్ హీరో శర్వానంద్ (Sharawand) ఎప్పుడు వైవిధ్యభరితమైన చిత్రాలను ఎంచుకుంటూ సక్కెస్ అవుతున్నాడు. కంటెంట్ ప్రాధాన్యత సినిమాల్లో నటిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఇందులో శర్వా సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రయూనిట్ సభ్యులతోపాటు హీరోహీరోయిన్లు పాల్గోన్నారు.
ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. “శతమానం భవతి తర్వాత మళ్లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేయలేదు, అలాగే మహానుభావుడు లాంటి మంచి ఎంటర్‌టైనర్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. ఆ సినిమాల్లో ఎలా నవ్వించాడో ఆ పాత శర్వా కావాలని చాలా మంది అడుగుతున్నారు. వాళ్లందరికీ ఒకటైతే కచ్చితంగా చెప్పగలను ఈ సినిమా చూసి వెళ్లేటప్పుడు ఒక మంచి చిరునవ్వుతో, ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఇంటికి వెళ్తారు. రాధికగారు, కుష్బుగారి లాంటి యాక్టర్స్‌తో కలిసి నటించడం గర్వంగా ఫీలవుతున్నారు. ఇదొక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. రష్మికతో కలిసి నటించడం చాలా సరదాగా ఉంటుంది. చాలా డైడికేటెడ్ పర్సన్. ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి థ్యాంక్స్. ముఖ్యంగా దర్శకుడు కిశోర్ తిరుమల ఇలాంటి ఒక బలమైన కథకి ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి టైటిల్ పెట్టడం నిజంగా ప్రశంసనీయం. ఇంత మంచి స్క్రిప్ట్ నా దగ్గరకి తీసుకువచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. చాలా హ్యాపీగా సినిమా తీశాం. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది“ అన్నారు.
అలాగే.. రష్మిక మందన్న మట్లాడుతూ – “కిషోర్ గారు ఈ స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నప్పుడే చాలా నవ్వుకున్నాను. సినిమా షూటింగ్ లో కూడా నవ్వుతూనే ఉన్నాం. డబ్బింగ్ సమయంలో కూడా నవ్వుతూనే ఉన్నాం..సినిమా అంతా ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి25 కోసం నేను చాలా ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా నా ఫేవరేట్ చిత్రాల్లో ఒకటి. ఇంత మంది సీనియర్ యాక్టర్స్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీ..సుధాకర్‌గారు, దేవీశ్రీ, కిషోర్, సుజీత్ గారి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది“అన్నారు.
Also Read: Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ… బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..
Vishnu Manchu: నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది.. కానీ కొంతమంది దాన్ని ఆయనకు అందజేయలేదు: మంచు విష్ణు
Sarkaru Vaari Paata: సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాటగా రికార్డు క్రియేట్ చేసిన కళావతి పాట..