Vishwak Sen: అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి మరో స్పెషల్ సాంగ్.. ఓరోరి సిన్నవాడా..
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). ఫలక్‌నుమాదాస్ నుంచి
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). ఫలక్‌నుమాదాస్ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న.. మార్చి 4న ఈ చిత్రం విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘సిన్నవాడా ..’ అనే పాట విడుదలైంది.
పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలో తెలియని ఓ గందరగోళం, చిన్నపాటి ఆతృత ఉంటాయి. వాటిని గురించి ప్రస్తావించేలా ‘సిన్నవాడా..’ సాంగ్ ఉంది. జానపదంలో సాగేలా పాట ఉండటంతో పాట వింటుంటే డిఫరెంట్‌గా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది. జై క్రిష్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని సిన్నవాడా పాటకు అనన్య భట్, గౌతమ్ భరద్వాజ్ తమ గొంతుకలతో ఓ కొత్తదనాన్ని అందించారు. ఈ ఇంట్రెస్టింగ్.. ఎంటర్‌టైనింగ్ చిత్రానికి.. సూపర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విద్యా సాగర్ చింతా చిత్రాన్ని తెరకెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. పవి కె.పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Bheemla Nayak: బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు మెగా హీరోలు పోటీ… బాబాయ్ భీమ్లాతో అబ్బాయ్ గని ఢీ..
Vishnu Manchu: నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది.. కానీ కొంతమంది దాన్ని ఆయనకు అందజేయలేదు: మంచు విష్ణు
Sarkaru Vaari Paata: సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పాటగా రికార్డు క్రియేట్ చేసిన కళావతి పాట..