CTET December Result 2021: సీటెట్ డిసెండర్ 2021 ఫలితాలు నేడు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ సెషన్ (CTET December Session) 2021 ఫలితాలను సీబీఎస్సీ (CBSE) ఫిబ్రవరి 16 (బుధవారం)న ప్రకటించనుంది..
CTET December Result 2021 date: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ సెషన్ (CTET December Session) 2021 ఫలితాలను సీబీఎస్సీ (CBSE) ఫిబ్రవరి 16 (బుధవారం)న ప్రకటించనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ పరీక్షలు గత ఏడాది డిసెంబర్ 16 నుంచి జనవరి 21 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 20 భాషల్లో జరిగాయి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు రెండు పేపర్లను రాయవల్సి ఉంటుంది. సీటెట్ డిసెంబర్ 2021 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ జనవరి 31న విడుదలయ్యింది. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 4 వరకు సవాలుకు అవకాశం ఇచ్చింది. వీటికి సంబంధించిన ఫలితాలు ప్రకటన తర్వాత మార్కుల షీట్లు, ధృవీకరణ సర్టిఫికేట్లు డీజీ లాకర్‌లో అందుబాటులో ఉంటాయి. సీటెట్ పేపర్ Iలో 150 మార్కులకు 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్-IIలో 150 మార్కులకు 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 300ల మార్కులకు ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. కాగా గతంలో సీటెట్ పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించేవారు. అయితే సీటెట్ డిసెంబర్ 2021 పరీక్షలను మాత్రం తొలిసారిగా ఆన్‌లైన్ మోడ్ (CBT) లో జరిగాయి. ఫలితాలు వెల్లడించిన తర్వాత పునఃమూల్యాంకనానికి అవకాశం ఉండదు.
సీటెట్ డిసెంబర్ 2021 ఫలితాలను ఎలా చెక్ చెయ్యాలంటే..
- సీటెట్ డిసెంబర్ 2021 ఫలితాలు ప్రకటన తర్వాత.. విద్యార్థులు CTET అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్ పేజ్‌లో సీటెట్ డిసెంబర్ 2021 ఫలితాలు లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
- రోల్ నంబర్‌ను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
- ఆ తర్వాత సీటెట్ డిసెంబర్ 2021 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
CTET January 2021 Mark sheets and Certificates are now available in DigiLocker. Download DigiLocker App today!https://t.co/WLOha1HVqM#CTET #CBSE pic.twitter.com/NCOIJaG8Br
— DigiLocker (@digilocker_ind) March 11, 2021
సీటెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ చెల్లుబాటు వ్యవధి అన్ని వర్గాలకు గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది. B.Edలో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా సీటెట్ పరీక్ష రాయొచ్చు. సీటెట్ అర్హత సర్టిఫికేట్.. చండీగఢ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, అండమాన్ & నికోబార్ దీవులు, కేంద్ర ప్రభుత్వ పాఠశాల(KVS, NVS, సెంట్రల్ టిబెటన్ పాఠశాలలు మొదలైనవి)ల్లో టీచర్ ఉద్యోగాలకు అర్హత కలిగా ఉంటారు.
Also Read: