Viral Video: పిల్లి – పాము మధ్య భీకర ఫైటింగ్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..

Viral Video: పాములు, ఇతర అడవి జంతువులు సహా ఇతర జీవులు అప్పుడప్పుడు ఇళ్లల్లోకి రావడం చూసే ఉంటాం.

Viral Video: పిల్లి - పాము మధ్య భీకర ఫైటింగ్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 16, 2022 | 9:11 AM

Viral Video: పాములు, ఇతర అడవి జంతువులు సహా ఇతర జీవులు అప్పుడప్పుడు ఇళ్లల్లోకి రావడం చూసే ఉంటాం. ఇంట్లోకి వచ్చిన పాములతో కుక్కలు, కోళ్లు పోట్లాడటం కూడా చూశాం. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఓ పిల్లి, పాము మధ్య భీకర పోరాటం జరిగింది. అది చూసి జనాలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని మామిడి కుదురు మండలం కోమరాడ గ్రామంలో ఇళ్ల మధ్యలోకి పాము వచ్చింది. అది గమనించిన.. పిల్లి ఆ పామును అడ్డగించింది. అంతే.. ఇక యుద్ధం మొదలైంది. పాము, పిల్లి ఒకదానిపై ఒకటి విరుచుకుపడ్డాయి. అది చూసిన స్థానికులు హడలిపోయారు. దాదాపు కొన్ని గంటల పాటు పాము – పిల్లి పోట్లాడుకున్నాయి. ఒళ్లు గగుర్పొడేలాంటి ఈ సన్నివేశంతో భయపడిపోయిన స్థానికులు.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. త్రాచు పామును బంధించి నిర్మానుష్య ప్రదేశంలో వదిలేశారు. కాగా, పాము – పిల్లి పోట్లాడుకుంటున్న సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది.

Also read:

Tumour: వృద్ధురాలికి పునర్జన్మ.. 47 కిలోల కణితిని తొలగించిన వైద్యులు.. ఎక్కడంటే?

ICSI Recruitment 2022: ఈ జాబ్స్‌కు అప్లై చేశారా? నెలకు రూ.40,000ల వరకు జీతంతో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

News Watch: AP DGPని ఎందుకు మార్చారో తెలుసా ?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్