Tumour: వృద్ధురాలికి పునర్జన్మ.. 47 కిలోల కణితిని తొలగించిన వైద్యులు.. ఎక్కడంటే?

Doctors remove 47 kg tumour: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని అపోలో (Apollo Hospital) వైద్యులు ఓ మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. 56 ఏళ్ల వృద్ధురాలికి

Tumour: వృద్ధురాలికి పునర్జన్మ.. 47 కిలోల కణితిని తొలగించిన వైద్యులు.. ఎక్కడంటే?
Apollo Hospital
Follow us

|

Updated on: Feb 16, 2022 | 9:04 AM

Doctors remove 47 kg tumour: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని అపోలో (Apollo Hospital) వైద్యులు ఓ మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. 56 ఏళ్ల వృద్ధురాలికి ఏకంగా 47 కిలోల కణితిని తొలగించి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. అహ్మదాబాద్‌లోని దేవ్‌గఢ్‌ బరియా ప్రాంతానికి చెందిన మహిళ 18 ఏళ్ల క్రితం అసాధారణంగా బరువు పెరిగింది. ఈ క్రమంలో వైద్యులను సంప్రదించడంతో ఆమె అండాశయంలో కణితి (Tumour) ఉన్నట్లు గుర్తించారు. 2004లో ఆమెకు ఓ ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే.. కడుపులో ఉన్న కణితి అంతర్గత అవయవాలతో కలిసిపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఉంటుందని భావించి ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపేశారు. అనంతరం కుట్లు వేసి ఆమెను ఇంటికి పంపారు. అప్పటినుంచి కణితి భారీగా పెరిగిపోయింది.

అసాధారణంగా కణితి పెరగడంతో.. ఆమె కుటుంబసభ్యులు అహ్మదాబాద్‌ అపోలో ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అనంతరం అక్కడి డాక్టర్‌ చిరాగ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని 8 మంది వైద్యులు ఆపరేషన్ చేశారు. జనవరి 27న భారీ కణితిని తొలగించినట్లు అపోలో వైద్యులు తెలిపారు. అనంతరం ఆమెను ఈ నెల 14న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు అపోలో వైద్యలు తెలిపారు. ఈ పరిమాణంలో కణితిని తొలగించడం ఇదే మొదటిసారని వైద్యులు తెలిపారు.

Also Read:

Viral Video: తగ్గేదెలే అంటున్న శునకం.. బ్యాండ్ వాయిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది..

Watch Video: ఇదేం బాల్‌రా బాబు.. బ్యాట్స్‌మెనే కాదు, కీపర్ కూడా పరేషానే.. షాకవుతోన్న నెటిజన్లు..!