AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నారులను అనాథలుగా చేసి.. కానరానిలోకాలకు తరలిపోయిన తల్లి

తల్లి చనిపోయిందని ఆ చిన్నారులకు తెలియదు. అమ్మ ఎందుకలా అచేతనంగా పడి ఉంది అనే సందేహం ఆ చిట్టి బుర్రలను తొలిచేసింది. లేమ్మా అని పిలిచినా స్పందన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో...

చిన్నారులను అనాథలుగా చేసి.. కానరానిలోకాలకు తరలిపోయిన తల్లి
Death
Ganesh Mudavath
|

Updated on: Feb 16, 2022 | 5:50 PM

Share

తల్లి చనిపోయిందని ఆ చిన్నారులకు తెలియదు. అమ్మ ఎందుకలా అచేతనంగా పడి ఉంది అనే సందేహం ఆ చిట్టి బుర్రలను తొలిచేసింది. లేమ్మా అని పిలిచినా స్పందన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో తల్లి మృతదేహం వద్ద మౌనంగా నిలబడిపోయారు ఆ ఇద్దరు చిన్నారులు. అమ్మ చనిపోయిందని, తిరిగి రాదని తెలియని ఆ పసిపిల్లలు దీనంగా కూర్చున్నారు. ఈ దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించింది. ఘటన వివరాలను స్థానికుల సహాయంతో తెలుసుకున్న అధికారులు.. చిన్నారులను శిశుగృహకు తరలించే ఏర్పాట్లు చేశారు. అనారోగ్యంతో మరణించిన మహిళకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఫాతిమా అనే మహిళ కొన్ని నెలల క్రితం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి షాద్ నగర్(Shad Nagar) పట్టణంలోని గంజ్‌ ప్రాంతానికి వచ్చింది. స్థానిక కూరగాయల మార్కెట్‌లో హమాలీగా పని చేస్తోంది.

నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫాతిమా.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందింది. అక్కడి నుంచి మందులు తెచ్చుకుని వాడుతోంది. ఈ క్రమంలో సోమవారం ఫాతిమా ఆరోగ్యం క్షీణించింది. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందింది. తమ కళ్లముందే తల్లి మృతి చెందడంతో ఆమె ఇద్దరు కూతుళ్లు బిక్కమొహమేశారు. ఏం జరిగిందో, ఏం చేయాలో అర్థంకాక అమాయకంగా కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని చూసి కొందరు చలించిపోయారు. అధికారులకు విషయాన్ని వివరించారు. పిల్లలను శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీడీపీవో నాగమణి తెలిపారు. మృతురాలు ఫాతిమాకు పోలీసులు అంతిమ సంస్కారం నిర్వహించారు.

Also Read

Shocking Video: చైన్ స్మోకర్‌లా స్మోక్ చేస్తున్న మేకపోతు.. వీడియో చూస్తే కంగు తినాల్సిందే

Maharshi Raghava : టాలీవుడ్ సీనియర్ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం

Manjula Ghattamaneni: కచ్చా బాదం పాటకు స్టెప్పులేసి రచ్చలేపిన మంజుల..