AP Crime: ఉసురు తీసిన అప్పులు.. గడ్డి మందు తాగిన దంపతులు.. భర్త మృతి

జీవితాంతం తోడుంటామని పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను ఆ దంపతులు తూచా తప్పకుండా పాటించాలనుకున్నారు. కాయా కష్టం చేసుకునే ఆ దంపతులను కరోనా మహమ్మారి ఆర్థికంగా కుంగదీసింది...

AP Crime: ఉసురు తీసిన అప్పులు.. గడ్డి మందు తాగిన దంపతులు.. భర్త మృతి
Poison Suicide
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 16, 2022 | 6:22 PM

జీవితాంతం తోడుంటామని పెళ్లినాడు చేసుకున్న ప్రమాణాలను ఆ దంపతులు తూచా తప్పకుండా పాటించాలనుకున్నారు. కాయా కష్టం చేసుకునే ఆ దంపతులను కరోనా మహమ్మారి ఆర్థికంగా కుంగదీసింది. మట్టి పనులు చేసుకుని జీవిస్తున్న ఆ కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి పడేసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ దంపతులు తనువు చాలించాలని నిశ్చయించుకున్నారు. గడ్డిమందు తాగారు. గమనించిన కుమారుడు.. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గ్రామస్థుల సహకారంతో తల్లిదండ్రులను ఆస్పత్రికి తరలించాడు. వైద్యశాలలో చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం చినమంగళాపురం గ్రామానికి చెందిన నాగవరపు రామారావు, తవిటమ్మ దంపతులు. గత కొన్నేళ్లుగా ఇటుకల తయారీ పరిశ్రమను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పులు చేసి పరిశ్రమను నడిపిస్తున్న సమయంలో.. కరోనా లాక్‌డౌన్‌ వారి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. ఏడాది పాటు వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో మరింత అప్పుల పాలయ్యారు. వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి రావడంతో దిక్కుతోచని స్థితిలో మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో దంపతులిద్దరూ గడ్డి మందు తాగారు.

ఆ సమయంలో ఇంటికి వచ్చిన కుమారుడు గౌరి.. తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. గ్రామస్థుల సహాయంతో ఇద్దరినీ పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రామారావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తవిటమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు గౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి.

Viral Video: ఈ కింగ్ కోబ్రా దాడి చూస్తే దడ పుట్టాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

చిన్నారులను అనాథలుగా చేసి.. కానరానిలోకాలకు తరలిపోయిన తల్లి

Shocking Video: చైన్ స్మోకర్‌లా స్మోక్ చేస్తున్న మేకపోతు.. వీడియో చూస్తే కంగు తినాల్సిందే

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.