Andhra Pradesh: సంచలనం.. మైనర్ బాలిక అత్యాచారం కేసులో కేసులో 64 మంది అరెస్టు..
AP Crime News: గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో.. తాజాగా మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 64 మంది అరెస్టయ్యారు.
Minor rape case: గుంటూరు జిల్లా(Guntur District)లో సంచలనం రేపిన బాలిక అత్యాచారం కేసులో.. తాజాగా మరికొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తల్లిలేని ఆ బాలికను మాయమాటలతో ఓ మహిళ తనవెంట తీసుకెళ్లి.. బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ కేసులో ఇప్పటివరకు 64 మంది అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలో గత ఏడాది జూన్ లో తల్లికూతుళ్ళకు కరోనా(Coronavirus) సోకింది. దీంతో జిజిహెచ్ లో చేరారు. చికిత్స పొందుతూ తల్లి చనిపోయింది. చికిత్స పొందుతున్న మైనర్ బాలికకు స్వర్ణకుమారి పరిచయం అయింది. కరోనాకు నాటు వైద్యం చేయిస్తానని బాలికకు మాయమాటలు చెప్పింది. తండ్రి అనుమతితోనే మైనర్ బాలిక స్వర్ణకుమారి వెంట వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత బాలికను వ్యభిచార కూపంలోకి దించింది సదరు మహిళ. గుంటూరుతో పాటు విజయవాడ, కాకినాడ, తణుకు, నెల్లూరు, హైదరాబాద్‌లో గల వ్యభిచార గృహాల్లో ఉంచి వ్యభిచారం చేయించింది. ఆరునెలల పాటు బాలిక చిత్రవధ అనుభవించింది. అప్పటికే బాలిక ఆరోగ్యం క్షీణించడంతో స్వర్ణ కుమారి చెర నుండి తప్పించుకుంది. నేరుగా తండ్రి వద్దకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును సీరియస్ గా తీసుకున్న అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వర్ణకుమారి తో పాటు 23 మందిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక ధీన గాధ విన్న జడ్జి శ్రీలత ఈ కేసులో ఉన్నవారందరిని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీస్ ప్రత్యేక బృందాలు బాలికతో వ్యభిచారం చేసిన వారందరి చిట్టా తీశారు
పలు జిల్లాల్లో తిరిగి ఇప్పటి వరకూ 64 మందిని అరెస్టు చేశారు. మైనర్ బాలిక కావటంతో అందరిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. బాలిక ఇస్తున్న సమాచారం ఆధారంగా అందరినీ అరెస్టు చేస్తున్నారు. ఒక అత్యాచారం కేసులో అరవై నాలుగు మంది అరెస్టు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.
Also Read: Shocking Video: చైన్ స్మోకర్‌లా స్మోక్ చేస్తున్న మేకపోతు.. వీడియో చూస్తే కంగు తినాల్సిందే