AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ కింగ్ కోబ్రా దాడి చూస్తే దడ పుట్టాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

వేటాడటం జంతువుల సహజలక్షణం.. కానీ తమజాతి వాటిని అవే వేటాడటం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ పాములు మాత్రం తమజాతిని వేటాడుతూ ఉంటాయి.

Viral Video: ఈ కింగ్ కోబ్రా దాడి చూస్తే దడ పుట్టాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
King Cobra
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2022 | 6:15 PM

Share

Viral Video: వేటాడటం జంతువుల సహజలక్షణం.. కానీ తమజాతి వాటిని అవే వేటాడటం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ పాములు మాత్రం తమజాతిని వేటాడుతూ ఉంటాయి. మామూలుగానే పామును చూస్తే పరిగెత్తుతాం.. అదే పాము వేటాడేటప్పుడు చూస్తే ఇంకేమైనా ఉందా.. గుండె జారిపోతుంది. సహజంగా పాములు చిన్న చిన్న జీవులను(ఎలుకలు, కప్పలు) వాటిని వేటాడుతాయి. పెద్ద పెద్ద కొండ చిలువ వంటివి కాస్త పెద్ద జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. అయితే కొన్ని పాములు ఇతర పాములను వేటాడి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఈ వీడియో దానికి సంబంధించిందే.. పాముల్లో ప్రమాదకరమైనది త్రాచుపాము దీనినే కొందరు నాగు పాము అంటారు. త్రాచుపాము ఎక్కువగా భారత దేశ అడవుల్లో కనిపిస్తూ ఉంటాయి.

నాగుపాము దాడి చాలా ప్రమాదకరమైనది, దాని దాడి నుండి ఎవరూ తప్పించుకోలేరు అంటుంటారు. నాగుపాము దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి. త్రాచు పాము దాడి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియోలో ఒక పాము వెళుతూ ఉండగా.. అప్పటికే కాపుకాసిన నాగుపాము దానిని వెనక నుంచి దాడి చేసింది. అయితే ఆ పాము కూడా కింగ్ కోబ్రాతో పోరాడటానికి ప్రయత్నిస్తుంది. త్రాచుపాములాంటి చురుకైన పాము ముందు ఇంకేదైనా పాము ఎక్కడ నిలబడబోతోంది.? అంతే, నాగుపాము తన నోటితో పామును గట్టిగా నొక్కి, కాసేపు అటూ ఇటూ తిప్పి  చివరకు మింగేసింది. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sai pallavi vs Teddy Bears: నేచురల్ బ్యూటీ ‘సాయి పల్లవి’తో పోటీ పడుతున్న ‘టెడ్డీ బేర్స్’.! కలర్స్‌లో తగ్గేదే లే.. వైరల్ అవుతున్న ఫొటోస్.

Shocking Video: చైన్ స్మోకర్‌లా స్మోక్ చేస్తున్న మేకపోతు.. వీడియో చూస్తే కంగు తినాల్సిందే

Mammikka: సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయిన 60 ఏళ్ల వృద్ధుడు.. నెట్టింట్లో వీడియోలు వైరల్..