Viral Question paper: ఇంజనీరింగ్ విద్యార్ధులకు వింత పరీక్ష..! క్వశ్చన్ పేపర్ మొత్తం ఆ సినిమా పైనే.. వైరల్ అవుతున్న వీడియో..
Movie story on question paper: కేరళలో వింత సంఘటన జరిగింది. మార్ అథనాసియస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధులకు మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. మెకానికల్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే సబ్జెక్టులో 50 మార్కుల క్వశ్చన్ పేపర్ మొత్తం మలయాళం సూపర్ హిట్ మూవీ 'మిన్నల్ మురళి' సినిమా గురించే ఇచ్చారు.
Movie story on question paper: కేరళలో వింత సంఘటన జరిగింది. మార్ అథనాసియస్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధులకు మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. మెకానికల్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే సబ్జెక్టులో 50 మార్కుల క్వశ్చన్ పేపర్ మొత్తం మలయాళం సూపర్ హిట్ మూవీ ‘మిన్నల్ మురళి’ సినిమా గురించే ఇచ్చారు. ఎగ్జామ్ రాయడానికి సిద్ధమైన విద్యార్థులు క్వశ్చన్ పేపర్ చూసి ఖంగు తిన్నారు. అంతే కాదు ఆ ఎగ్జామ్ పేపర్ చివర్లో ఒక గమనిక కూడా ఉంది. అదేంటంటే.. “ప్రశ్న పత్రం అంతా కల్పితం. నన్ను విమర్శించాలనుకుంటే తర్వాత విమర్శించండి. ఆల్ ది బెస్ట్.. ఎగ్జామ్‌ని ఎంజాయ్ చేయండి” అని రాసి ఉంది. అది చూసి స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు. ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Published on: Feb 16, 2022 06:08 PM
వైరల్ వీడియోలు
Latest Videos