AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: సులభంగా బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. చికాగో యూనివర్సిటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు..

Health Tips: చక్కని నిద్ర మన ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మేలు చేస్తుంది. ఇదే కాకుండా ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా.

Weight Loss: సులభంగా బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. చికాగో యూనివర్సిటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు..
Weight Loss
Venkata Chari
|

Updated on: Feb 17, 2022 | 6:45 AM

Share

Health Tips: బిజీ లైఫ్ కారణంగా ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని(Good Health) జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నారు. అందువల్ల ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం(Weight Loss)తో శరీరంలో అనేక రకాల వ్యాధులు దాడిచేసే వీలుంటుంది. దీని వల్ల అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్, గుండె జబ్బులు, మోకాళ్ల నొప్పులు తదితర సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మరిన్ని ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. చికాగో యూనివర్సిటీలో నిర్వహించిన పరిశోధనలో ఊబకాయం గురించి కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. దీనిలో మంచి నిద్ర మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇదే కాకుండా ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని తేలింది.

బరువు తగ్గేందుకు నిద్ర ఎంతో సహాయం చేస్తుంది..

ప్రతిరోజూ ఒక గంట ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు తమ బరువును తగ్గించుకోవడంలో ముందుంటారు. ప్రతి రోజూ ఒక గంట అదనంగా నిద్రపోయే వ్యక్తులు సంవత్సరంలో మూడు కిలోల బరువు తగ్గుతారని చికాగో యూనివర్సిటీ పరిశోధనలో పేర్కొంది. ఈ పరిశోధనలో 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిపై ప్రయోగాలు చేసినట్లు పేర్కొన్నారు. రోజుకు 6.5 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోల్చినట్లు వెల్లడించారు.

చక్కని నిద్ర అవసరం..

రోజుకు సాధారణ నిద్ర కంటే 1 గంట 20 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు 270 కేలరీలను తక్కువగా వినియోగిస్తారని పరిశోధనలో తేలింది. ఇలా చేయడం వల్ల ఏడాదిలో వారు దాదాపు 4 కిలోల బరువు తగ్గారు. కాబట్టి మీరు చాలా కాలం పాటు తగినంత నిద్ర పోవడం వల్ల ఊబకాయాన్ని తగ్గించుకోవడంలో ప్రయోజనం పొందుతారు. దీనికోసం మీరు కష్టడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా చక్కని నిద్ర పోవడం కీలకం. సో చక్కని నిద్రతో హాయిగా బరువు తగ్గండి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవాలి.

Also Read: Green Chilli: కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు

Polished rice: పాలిష్ చేసిన రైస్‌ 3 పూటలా తింటున్నారా..? అయితే మీకు ముప్పు తప్పదు