Non Stick Pan Disadvantages: నాన్ స్టిక్ పెనంపై వేసిన దోశ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

ప్రస్తుతం దాదాపు అందరు నాన్ స్టిక్ పెనం వాడుతున్నారు. ముఖ్యంగా దోశను నాన్‌ స్టిక్ పెనంపై వేస్తుంటారు. ఎందుకంటే దీనికి పిండి అట్టుకోదు దోశ బాగా వస్తుంది..

Non Stick Pan Disadvantages: నాన్ స్టిక్ పెనంపై వేసిన దోశ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..
Non Stick
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 17, 2022 | 6:45 AM

ప్రస్తుతం దాదాపు అందరు నాన్ స్టిక్ పెనం వాడుతున్నారు. ముఖ్యంగా దోశను నాన్‌ స్టిక్ పెనంపై వేస్తుంటారు. ఎందుకంటే దీనికి పిండి అట్టుకోదు దోశ బాగా వస్తుంది. అందుకే చాలా మంది ఇనుప పెనాన్ని పక్కన పడేసి నాన్‌స్టిక్‌ పెనం తెచ్చుకుంటున్నారు. కానీ నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నాన్ స్టిక్ ప్యాన్‌పై పిండి వేసిన తర్వాత అంటుకోకుండా దోశ రావడానికి ముఖ్య కారణం ఆ ఆ పెనం మీద ఉండే కోటింగ్. ఆ కోటింగ్ టెఫ్లాన్‌తో వేస్తారు. టెఫ్లాన్ అనేది ఒక రసాయన పదార్థం. ఇలా కెమికల్స్ తో తయారైన నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల కిడ్నీ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ప్యాన్ వేడి చేయడం వల్ల టెఫ్లాన్ కరిగి ఆహారంలో కలుస్తుంది. దాని వల్ల కెమికల్ మనిషి శరీరంలోకి వెళ్తుంది. అదే ఇనుప పెనం మీద అయితే ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఇనుప పెనం మీద చేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Polished rice: పాలిష్ చేసిన రైస్‌ 3 పూటలా తింటున్నారా..? అయితే మీకు ముప్పు తప్పదు

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..