Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajol: ముంబైలో రెండు ఖరీదైన బంగ్లాలు కొన్న కాజోల్‌.. ధర ఎంతో తెలుసా?

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ సతీమణి కాజోల్‌ (Kajol) తాజాగా కొత్త ఫ్లాట్లు కొనుగోలు చేసింది. ముంబై(Mumbai) లో విలాసవంతమైన ప్రాంతంగా పేరొందిన జుహులో   రెండు లగ్జరీ ఫ్లాట్లను తన పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది.

Kajol: ముంబైలో రెండు ఖరీదైన బంగ్లాలు కొన్న కాజోల్‌.. ధర ఎంతో తెలుసా?
Kajol
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2022 | 8:42 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ సతీమణి కాజోల్‌ (Kajol) తాజాగా కొత్త ఫ్లాట్లు కొనుగోలు చేసింది. ముంబై(Mumbai) లో విలాసవంతమైన ప్రాంతంగా పేరొందిన జుహులో   రెండు లగ్జరీ ఫ్లాట్లను తన పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. సుమారు 2000 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఆ ఫ్లాట్ల ధర సుమారు 12 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే కాజోల్ ప్రస్తుతం నివసిస్తున్న శివశక్తి బంగ్లాకి సమీపంలోనే ఈ రెండు విలాసవంతమైన ఫ్లాట్‌లు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయినట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది.

ఇదిలా ఉంటే కాజోల్‌ భర్త అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా గతేడాది జుహులో రూ.60 కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఇక సినిమాల విషయానికొస్తే.. కాజోల్‌ గతేడాది ‘త్రిభంగ’ అనే సినిమాలో నటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమాలో మిథిలా పాల్కర్‌, తన్వి అజ్మీ, మానవ్‌ గోహిల్‌, కునాల్‌ రాయ్‌ కపూర్‌ తదితరులు నటించారు. అంతకుముందు ‘దేవి’ అనే షార్ట్‌ ఫిలింలోనూ నటించింది. ప్రస్తుతం ఆమె సీనియర్‌ నటి రేవతి దర్శకత్వంలో ‘సలాం వెంకీ’ సినిమా చేస్తోంది. ఇటీవల ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Also Read:Manickam Tagore: ఉన్నట్లుండి మౌన మునిలా మారిపోయిన మాణికం ఠాగూర్!.. గాంధీ భవన్‌లో హాట్‌ టాపిక్‌గా రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ వ్యవహారం..

Supreme Court: ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్‌.. కీలక తీర్పు వెలువరించిన సుప్రీం..

Kodali Nani: వైఎస్ వివేకా హత్య చార్జీషీట్‌లో ఏముందో బయటకు వెల్లడించాలి.. చంద్రబాబుపై మళ్లీ మండిపడ్డ కొడాలి నాని..