Viral Video: పుష్ప డైలాగులతో అదరగొడుతున్న చిన్నారి నెట్టింట వైరల్ అవుతున్న రీల్స్.. వీడియో
ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప సినిమా పాటలే వినబడుతున్నాయి. ఈ పాటలకు క్రికెటర్లు, సెలెబ్రిటిలు సైతం తమదైన స్టయిల్‌లో స్టెప్పులేస్తూ పుష్పను ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బుడ్డోడు వచ్చి చేరాడు. ఓ చిన్నోడు పుష్ప సినిమా డైలాగ్స్‌తో ఇన్‌స్టా రిల్స్ చేస్తూ అదరగొడుతున్నాడు.
ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప సినిమా పాటలే వినబడుతున్నాయి. ఈ పాటలకు క్రికెటర్లు, సెలెబ్రిటిలు సైతం తమదైన స్టయిల్‌లో స్టెప్పులేస్తూ పుష్పను ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బుడ్డోడు వచ్చి చేరాడు. ఓ చిన్నోడు పుష్ప సినిమా డైలాగ్స్‌తో ఇన్‌స్టా రిల్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఆ బుడ్డోడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఓ చిన్నారి ఎంతో క్యూట్ గా ఉన్నాడు. గ్రీన్ కలర్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ఫ్యాంట్ వేసుకొని ఉన్నాడు. ఈ చిన్నారి మెట్లపైన కూర్చుని ఉన్నాడు. మామూలుగా కాదు.. కాలు మీద కాలు వేసుకొని.. ఇంతలో ఆ కుర్రాడిని ఎవరేమన్నారో కానీ… పుష్ప రేంజ్‌లో రియాక్టయ్యాడు. “ఈ కాలు నాదే… ఈ కాలు కూడా నాదే… నా కాలు మీద నా కాలేసుకుంటిని… నీ ఓనర్ మీదేసినా ఏవి..” అనే డైలాగ్‌తో అదరగొట్టాడు. ఇలా ఈ చిన్నారి పుష్ప సినిమాలోని మరికొన్ని డైలాగులకు కూడా రీల్స్ చేశాడు. వాటిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఓర్నీ.. బుడ్డోడు పుష్పను దించేశాడుగా… అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారి రీల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ:
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

