AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య రజినీకాంత్‌.. ఏమన్నారంటే..

Aishwarya Rajinikanth: తమిళ స్టార్‌ హీరో ధనుస్‌, రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా విడిపోతున్నట్లు...

Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఐశ్వర్య రజినీకాంత్‌.. ఏమన్నారంటే..
Aishwarya Rajinikanth
Narender Vaitla
|

Updated on: Feb 17, 2022 | 8:17 PM

Share

Aishwarya Rajinikanth: తమిళ స్టార్‌ హీరో ధనుస్‌, రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈ జంట సోషల్‌ మీడియా వేదికగా విడిపోతున్నట్లు వేర్వేరుగా పోస్టులు చేశారు. ఎంతో అన్యోయంగా ఉన్న ఈ జంట విడాకుల ప్రకటన చూసిన ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అసలు వీరిద్దరూ విడిపోవడానికి కారణమేంటన్న విషయం కూడా ఇంకా తెలియలేదు. అయితే విడాకుల తర్వాత ఈ జంట ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య వివాదాలను పరిష్కరించడానికి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఈ నేపథ్యంలో విడాకుల తర్వాత ఐశ్వర్య తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చేశారు ఐశ్వర్య. విడాకుల విషయమై ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికి ఆటుపోట్లు ఎదురవుతాయి. వాటిని తప్పకుండా ఎదుర్కొవాలి. మనకు ఏదయితే రావాలో అది తప్పకుండా వస్తుంది. ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ. వ్యక్తిగత అంశాలతో దానికి సంబంధం లేదు.

నేను ఎదిగే కొద్ది నాతో పాటు ప్రేమ నిర్వచనం మారుతోంది. నా పిల్లలతో సహా మా అమ్మ, నాన్నలను నేను ప్రేమిస్తాను. ప్రేమ అనేది ఏ ఒక్క వ్యక్తికి పరిమితం కాకూడదని నేనకుంటున్నాను’ అంటూ ఐశ్వర్య తెలిపారు. ఐశ్వర్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలివుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Also Read: Watch Live: మేడారం జాతరలో అసలు ఘట్టం సమ్మక్క ఆగమనం.. మేళ తాళాలతో గద్దెలపైకి..(ఎక్స్‌క్లూజీవ్ వీడియో)

Uncharted : మరో ఆసక్తికర యాక్షన్ మూవీతో రానున్న స్పైడ‌ర్ మ్యాన్ ఫెమ్ టామ్ హోలెండ్ .. అన్ ఛార్టెడ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..

Aishwarya Rajesh: ట్రెండ్ మార్చిన తెలుగమ్మాయి.. ‘ఐశ్వర్య రాజేష్’ లేటెస్ట్ ఫొటోస్..