Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. ! అంటున్న రాహుల్ రామకృష్ణ.. మండిపడుతున్న నెటిజన్లు..(వీడియో)
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. పైగా చిన్న వయసు.. అయితే సడెన్ గా నేను సినిమాలకు గుడ్ బై చెబుతున్నా.. 2022 ఏడాది సినిమాల్లో చివరి సంవత్సరం. ఇకపై సినిమాలు చేయనని నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి సంచలనం సృష్టించాడు. రాహుల్ చేసిన ఈ ట్వీట్....
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. పైగా చిన్న వయసు.. అయితే సడెన్ గా నేను సినిమాలకు గుడ్ బై చెబుతున్నా.. 2022 ఏడాది సినిమాల్లో చివరి సంవత్సరం. ఇకపై సినిమాలు చేయనని నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి సంచలనం సృష్టించాడు. రాహుల్ చేసిన ఈ ట్వీట్ అటు సోషల్‌మీడియాలోనే కాదు, చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. అయితే తన రిటైర్మంట్ నిర్ణయం పై రాహుల్ మరోసారి స్పందించాడు. తాను సినిమాలకు ఈ ఏడాది గుడ్ బై చెబుతున్నట్లు చేసిన ట్వీట్ జోక్ అని, అంతా తూచ్ అన్నాడు. తాను జోక్ చేశానని.. సినిమాల్లో నటించడం వలన భారీ పారితోషకం, విలాసవంతమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలు వస్తున్నాయని.. అవన్నీ ఎందుకు వదులుకుని సినిమాలకు గుడ్ బై చెబుతా అంటూ పోస్ట్ చేశాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించానని.. స్నేహితులు ఫోన్ చేసి మరీ చెప్పటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశాడు. రాహుల్ ఇచ్చిన క్లారిటీ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు సినిమాల్లో కామెడీ చెయ్.. . ట్విటర్‌లో కాదు అన్నా అంటూ మండిపడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

