Samantha Ruth Prabhu: ‘అలా ఉంటేనే మనం కోరుకున్నవన్నీ మనకు దక్కుతాయి’.. సమంత ఇంట్రస్టింగ్ పోస్ట్..
హీరోయిన్ సమంత.. ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ స్టార్. ఒకప్పుడు రెగ్యులర్ హీరోయిన్‌గా హీరోల పక్కన ఆడిపాడిన సామ్.. ఇప్పుడు తానే ఒక క్రౌడ్ పుల్లర్‌గా మారారు. పాత్రలకు ప్రాథాన్యత ఇస్తూ.. అలాంటి సినిమాలను పిక్ చేసుకుంటూ.. తన మార్కెట్ రేంజ్ పెంచుకున్నారు సామ్.
హీరోయిన్ సమంత.. ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ స్టార్. ఒకప్పుడు రెగ్యులర్ హీరోయిన్‌గా హీరోల పక్కన ఆడిపాడిన సామ్.. ఇప్పుడు తానే ఒక క్రౌడ్ పుల్లర్‌గా మారారు. పాత్రలకు ప్రాథాన్యత ఇస్తూ.. అలాంటి సినిమాలను పిక్ చేసుకుంటూ.. తన మార్కెట్ రేంజ్ పెంచుకున్నారు సామ్. 10 నిమిషాల ఐటమ్ సాంగ్‌లో నర్తించినందుకు… కోట్లు తీసుకునే స్థాయికి సామ్ వెళ్లారు. ఇక నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన సమంత మోటివేషన్ కొటేషన్స్ పెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ఆమె ఏదైనా పోస్ట్ పెడితే చాలు.. ఫ్యాన్స్ ఇట్టే వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫాక్ట్ అంటూ సామ్ పెట్టిన ఓ కొటేషన్ తెగ ట్రెండ్ అవుతోంది. జీవితంలో ఎదుగుదలకు క్రమశిక్షణ ఎంత ప్రధాన భూమిక పోషిస్తోందో ఈ కొటేషన్ ద్వారా చెప్పారు సామ్. ఈ పోస్ట్‌లో “డిసిప్లెన్‌గా ఉండాలని ఒకరు చెప్పాల్సిన పనిలేదు, క్రమశిక్షణ మనల్ని బలంగా తయారుచేస్తుంది. క్రమశిక్షణతో ఉంటే తాత్కాలిక ఆనందాలు దక్కకపోయినప్పటికీ.. మున్ముందు అంతకుమించిన ఫలితాలు దరికి చేరతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే పునాది కూడా. మీరు కోరుకున్నవన్నీ మీకు ఇచ్చేంతగా మిమ్మల్ని మీరు ప్రేమించడం కూడా తప్పనిసరి” అనేది సామ్ పోస్ట్‌లోని సారాంశం. ఇక ఇటీవలే ‘పుష్ప’ మూవీలో ఐటెం సాంగ్ దుమ్ములేపిన సామ్.. గుణశేఖర్ డైరక్షన్‌లో ‘శాకుంతలం’ మూవీ కంప్లీట్ చేసారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
మరిన్ని చూడండి ఇక్కడ: