Supreme Court: ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్‌.. కీలక తీర్పు వెలువరించిన సుప్రీం..

ఇటీవల ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్ల అంశం బాగా చర్చనీయాంశమవుతోంది. దీనివల్ల ప్రతిభగలవారికి అన్యాయం జరుగుతోందని ప్రైవేట్‌ యాజమాన్యాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి

Supreme Court: ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్‌.. కీలక తీర్పు వెలువరించిన సుప్రీం..
Supreme Court Of India
Follow us
Basha Shek

|

Updated on: Feb 17, 2022 | 6:50 PM

ఇటీవల ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్ల అంశం బాగా చర్చనీయాంశమవుతోంది. దీనివల్ల ప్రతిభగలవారికి అన్యాయం జరుగుతోందని ప్రైవేట్‌ యాజమాన్యాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్‌ అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న హర్యానా ప్రభుత్వ చట్టాన్ని సమర్థించింది. ఈ నిర్ణయంపై స్టే విధించిన పంజాబ్‌-హర్యానా హైకోర్టు నిర్ణయాన్ని కొట్టేసింది. ఇదే సమయంలో ఈ చట్టాన్ని అమలుపరచని ప్రైవేట్‌ సంస్థలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా హర్యానా ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. నాలుగు వారాల్లో ఈ వ్యవహారంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పంజాబ్‌ -హర్యానా హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు..

కాగా హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ప్రతిభకు, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రైవేటు యాజమాన్యాలు వాదిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టం కేవలం భౌగోళిక వర్గీకరణను మాత్రమే ప్రస్తావిస్తోందని, దీనికి రాజ్యాంగం అనుమతిస్తోందని చెబుతోంది. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కు, ఆరోగ్య, హక్కు, జీవన ప్రమాణాలు, ఉపాధి పొందే హక్కులను కాపాడటానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు వాదించింది. హర్యానా రాష్ట్ర స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం, 2020 ప్రకారం నెలకు రూ.30,000 కన్నా తక్కువ వేతనం చెల్లించే ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలి. ఈ చట్టం జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది. హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ గతంలో కొన్ని ప్రైవేట్‌ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులపై పంజాబ్‌ -హర్యానా హైకోర్టు స్టే విధించింది. దీనిపై హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో హర్యానా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Also Read:Wives Discipline: మొండిగా ఉండే భార్యలను మెల్లగా కొట్టొచ్చు.. భర్తలకు సలహా ఇచ్చిన మహిళా మంత్రి.. మండిపడుతోన్న మహిళా సంఘాలు, నెటిజన్లు..

Kodali Nani: వైఎస్ వివేకా హత్య చార్జీషీట్‌లో ఏముందో బయటకు వెల్లడించాలి.. చంద్రబాబుపై మళ్లీ మండిపడ్డ కొడాలి నాని..

Naga Chaitanya: అక్కినేని అందగాడితో మళ్లీ జత కట్టనున్న లైలా!.. దర్శకుడు ఎవరంటే..