Kodali Nani: వైఎస్ వివేకా హత్య చార్జీషీట్‌లో ఏముందో బయటకు వెల్లడించాలి.. చంద్రబాబుపై మళ్లీ మండిపడ్డ కొడాలి నాని..
వైఎస్ వివేకా హత్య చార్జీషీట్ లోని మొత్తం విషయాలు బయటకు వెల్లడించాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని (Kodaki Nani) డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా హత్య చార్జీషీట్ లోని మొత్తం విషయాలు బయటకు వెల్లడించాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని (Kodaki Nani) డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన 420 ముఖ్యమంత్రి అయ్యారని పరోక్షంగా మరోసారి చంద్రబాబుపై మండిపడ్డారాయన. వివేకా హత్యను చంద్రబాబు అండ్ కో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకుంటుందని మంత్రి ఆరోపించారు. ఈ మేరకు గురువారం మాట్లాడిన నాని చంద్రబాబు ను మరోసారి టార్గెట్ చేసుకున్నారు. ‘ప్రజల్ని, దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం వైఎస్ ది. అలాంటి ఇంట్లో మహిళలను రోడ్డు మీదకు లాగడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. విజయమ్మ, షర్మిలమ్మ, భారతమ్మ అని మాట్లాడుతుంటారు. అదే మేం విమర్శలు చేస్తే అందరి ముందు ఏడుస్తారు ‘.
సన్నబియ్యం ఎగుమతిలో ఎలాంటి అవినీతి లేదు..
‘చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఆయన ఈ జన్మలో సీఎం కాలేరు. అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ లో బియ్యాన్ని అమ్ముకుంటున్నారు అని తప్పుడు రాతలు రాస్తున్నారు. కాకినాడ పోర్ట్ నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి అవుతోంది. రైతులు సాగుచేసే పంటల వివరాలు ఈ క్రాప్ యాప్‌లో ఉంటాయని, సన్నబియ్యం ఎగుమతిలో ఎలాంటి అవినీతి జరగడం లేదు’ అని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక డీజీపీని తప్పించడంపై వస్తోన్న విమర్శలపై స్పందిన నాని.. ‘డీజీపీ మార్పుపై చంద్రబాబు అతిగా స్పందిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మంది డీజీపీలను మార్చాడో చెప్పాలి. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే టీడీపీ అధినేత పని’ అంటూ విమర్శలు గుప్పించాడు నాని.
Also Read:Adah Sharma: డస్ట్‌బిన్ తో డ్యాన్స్ చేసిన హార్ట్ ఎటాక్ హీరోయిన్ .. నెటిజన్లు ఏమంటున్నారంటే.. Naga Chaitanya: అక్కినేని అందగాడితో మళ్లీ జత కట్టనున్న లైలా!.. దర్శకుడు ఎవరంటే..