Bheemla Nayak OTT: భీమ్లానాయక్ సినిమాపై కీలక అప్‌డేట్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి నటిస్తోన్న చిత్రం ‘భీమ్లానాయక్’ (BheemlaNayak). నిత్య మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి నటిస్తోన్న చిత్రం ‘భీమ్లానాయక్’ (BheemlaNayak). నిత్య మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేం సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ అందించిన పాటలు ఇప్పటికే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్‌గా తీస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్, సింగిల్స్‌కు అద్భుతమైన హైప్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక రికార్డుల బాక్సులు బద్దలయ్యే సమయం వచ్చిందని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
అయితే, ఈ సినిమాకు గురించి ఓ తాజా అప్డేట్ ఫిల్మ్ నగర్‌లో హల్ చల్ చేస్తుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థలు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ సినిమాకు లేని రికార్డు ‘భీమ్లానాయక్’ సినిమాకు సొంతమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ ధరను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే థియేటర్స్‌లో ఈ మూవీ రిలీజ్ అయ్యాక 45 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.
Also Read: Amala Paul: అమలా పాల్ కండిషన్‌కు అదిరిపడ్డ నిర్మాతలు.. మా వల్ల కాదు బాబోయ్ అంటూ..