Megastar Star Chiranjeevi: సినిమాల్లో అడుగు పెట్టిన రెండేళ్లకే ‘చిరు’ పెళ్లి.. ఆనాటి పెళ్లి ఫోటో, శుభలేఖ వైరల్

Megastar Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఇష్టంతో కష్టాన్ని ఇష్టంగా పడి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. స్వయం కృషితో  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ..

Megastar Star Chiranjeevi: సినిమాల్లో అడుగు పెట్టిన రెండేళ్లకే 'చిరు' పెళ్లి.. ఆనాటి పెళ్లి ఫోటో, శుభలేఖ వైరల్
Chiranjeevi Wedding Rare Ph
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2022 | 9:25 PM

Megastar Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఇష్టంతో కష్టాన్ని ఇష్టంగా పడి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. స్వయం కృషితో  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమైనా.. తొలిసారిగా కెమెరా ముందు నటించిన సినిమా పునాది రాళ్లు. 1978లో పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది. కెరీర్ మొదట్లో హీరోగా విలన్ గా, చిన్న చిన్న అతిధి పాత్రల్లో , నలుగురు హీరోల్లో ఒకడిగా ఇలా తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. తనదైన నటన, డాన్సులతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే చిరంజీవి ఇంకా నటుడుగా ఎదుగుతున్న సమయంలోనే అంటే.. సినిమాల్లో అడుగు పెట్టిన రెండేళ్లకే టాలీవుడ్ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది. చిరంజీవి కష్టపడే తత్వాన్ని అప్పట్లోనే గుర్తించిన అల్లు రామలింగయ్య తన కుమార్తె సురేఖ ను చిరంజీవికి ఇచ్చి  20వ తేదీ ఫిబ్రవరి 1980లో పెళ్లి చేశారు. రెండు రోజుల్లో చిరంజీవి, సురేఖల పెళ్లి జరిగి 42 ఏళ్ళు పూర్తి కానున్నాయి.

చిరంజీవి సురేఖల వివాహ వార్షికోత్సం రానున్న సందర్భంగా అలనాటి పెళ్లి ఫోటో మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి పెళ్లి చేసుకుంటున్న సమయంలో నూతన్‌ ప్రసాద్‌తో కలిసి ‘తాతయ్య ప్రేమలీలలు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ  సినిమా షూటింగ్ లో పాల్గొన్న చిరంజీవి షర్ట్ చిరిగిపోయింది. అయితే ముహర్త సమయానికి ఆలస్యం అవుతుందని.. అదే షర్ట్ తో పెళ్లి మండపానికి చిరంజీవి వెళ్లడం.. చిరిగిన బట్టలతోనే సురేఖ మేడలో తాళిని కట్టడం జరిగిందని ఒకానొక సందర్భంలో చిరంజీవి తన పెళ్లి జ్ఞాపకాలను తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి పంచుకున్న సంగతి తెలిసిందే.

Also Read:   హీరో చేతిలో హీరో.. టాలీవుడ్‌లో టాప్ ఫ్యామిలీ వారసులు.. ఎవరో తెలుసా..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!